Telugu Global
International

చెవులు కట్ చేయించుకుని... జార్ లో దాచుకున్నాడు !

శరీరం అందంగా కనిపించేందుకు ఏదో చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేవారిని మనం చూస్తుంటాం. ముఖ్యంగా నటీనటులు ఈ పని చేస్తుంటారు. అయితే జర్మనీకి చెందిన 39 ఏళ్ల శాండ్రోకి… తన శరీరంలో వినూత్న మార్పులు చేసుకోవటం అంటే పిచ్చి. అతని రూపంలో అలాంటి మార్పులు 17 చేయించుకున్నాడు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెట్టాడు. శాండ్రోకి ఈ విషయంలో ఉన్న వ్యామోహం ఎంత తీవ్రంగా ఉందంటే… తల కేవలం పుర్రెలా గుండ్రంగా కనిపించాలనే కోరికతో ఆపరేషన్ చేయించుకుని చెవులు తీయించేసుకున్నాడు. […]

చెవులు కట్ చేయించుకుని... జార్ లో దాచుకున్నాడు !
X

శరీరం అందంగా కనిపించేందుకు ఏదో చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేవారిని మనం చూస్తుంటాం. ముఖ్యంగా నటీనటులు ఈ పని చేస్తుంటారు. అయితే జర్మనీకి చెందిన 39 ఏళ్ల శాండ్రోకి… తన శరీరంలో వినూత్న మార్పులు చేసుకోవటం అంటే పిచ్చి. అతని రూపంలో అలాంటి మార్పులు 17 చేయించుకున్నాడు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెట్టాడు.

శాండ్రోకి ఈ విషయంలో ఉన్న వ్యామోహం ఎంత తీవ్రంగా ఉందంటే… తల కేవలం పుర్రెలా గుండ్రంగా కనిపించాలనే కోరికతో ఆపరేషన్ చేయించుకుని చెవులు తీయించేసుకున్నాడు. 2019లో ఈ ఆపరేషన్ చేయించుకుని చెవులను ఒక జార్ లో వేసి పెట్టుకున్నాడు. అందుకే ఇతడిని మిస్టర్ స్కల్ ఫేస్ అని పిలుస్తుంటారు.

శాండ్రోకి మొదట టాటూలు అంటే చాలా ఇష్టం ఉండేది. తరువాత కాలంలో శరీరంలో కొన్ని భాగాల్లో ప్రత్యేక అమరికలు పెట్టించుకోవటం మొదలుపెట్టాడు. అలా అతని తలపైన, చేతులపైన ఇంప్లాంట్స్ కనబడుతుంటాయి. శాండ్రోని చూసినవారు క్రేజీ అని, అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అంటుంటారు కానీ శాండ్రో మాత్రం తన రూపం తనలో మరింత ఆత్మ విశ్వాసం పెంచుతుందంటున్నాడు.

జనం తన వంక అదే పనిగా చూసినా, విమర్శించినా పట్టించుకోనని… తన మనసుకి బాగా నచ్చే అలా చేయించుకున్నానని, దీనివలన తన ఆత్మ విశ్వాసం మరింతగా పెరుగుతుందని శాండ్రో చెబుతున్నాడు.

అయితే శాండ్రో విపరీత ధోరణి అతని జీవితంపైన ప్రభావం చూపించింది. ఉద్యోగం పోయింది. భార్య వదిలి వెళ్లిపోయింది. ఇవేమీ తనలో మార్పు తేలేదు. ఇక ముందు కూడా శరీరంలో కొన్ని కొత్త మార్పులు చేయించుకునే ఉత్సాహంలో ఉన్నాడు.

First Published:  27 Aug 2020 9:40 PM GMT
Next Story