సోనియాకు 23 మంది సీనియర్ల లేఖ
సోనియా గాంధీకి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఒక ఘాటు లేఖ రాశారు. పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతూ పలు అంశాలను ప్రస్తావించారు. సోనియా కుటుంబం పట్ల విధేయత చూపుతూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక్క రోజు ముందు ఈ లేఖ అంశం చర్చకు వచ్చింది. ఈ లేఖ 15రోజుల క్రితమే సీనియర్లు రాసినట్టు ప్రచారం జరిగినా కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ వచ్చారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో సీనియర్లు […]
సోనియా గాంధీకి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఒక ఘాటు లేఖ రాశారు. పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతూ పలు అంశాలను ప్రస్తావించారు. సోనియా కుటుంబం పట్ల విధేయత చూపుతూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక్క రోజు ముందు ఈ లేఖ అంశం చర్చకు వచ్చింది. ఈ లేఖ 15రోజుల క్రితమే సీనియర్లు రాసినట్టు ప్రచారం జరిగినా కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ వచ్చారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో సీనియర్లు అనేక అంశాలను ప్రస్తావించారు. పార్టీని కింది నుంచి పై వరకు ప్రక్షాళన చేయాలని నేతలు కోరారు. పార్టీకి పూర్తికాలం అధ్యక్షుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. దూరదృష్టి, క్రియాశీలత ఉన్న నాయకత్వం చేతిలో పార్టీని ఉంచాలని సీనియర్ స్పష్టం చేశారు.
పార్టీలో నైరాశ్యంపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వల్ల ప్రజలు పార్టీపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పుంజుకుని నిలబడడం భారత ప్రజాస్వామ్యానికి అత్యవసరమని సీనియర్లు లేఖలో వ్యాఖ్యానించారు. పార్టీలో ఈ పరిస్థితి శ్రేణుల ఆత్మస్తైర్యాన్ని కూడా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగ పతనం, పెరుగుతున్న నిరుద్యోగం, విభజన రాజకీయాలు, వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళన, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ దిశానిర్దేశం చేసేలా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ముఖ్యంగా యువతకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగించడంలో విఫలవడం ప్రమాదకరమైన సంకేతమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. సోనియాకు రాసిన లేఖపై సంతకం చేసిన వారిలో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, భూపేందర్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చవాన్, శశిథరూర్, మిలిందర్ దేవరా, జితిన్ ప్రసాద్ లాంటి 23 మంది సీనియర్ నాయకులున్నారు.