ఆ బాధలు మగవారికి అర్థం కావు... అంతే !
‘మహిళలకు నెలసరి సమయంలో సెలవు ఇవ్వాలి… ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం’… అనే నినాదం ఎప్పటినుండో ఉన్నా ఈ ‘విశ్రాంతి’… అనేది ఏ మానవ హక్కుల్లోకి, ప్రాథమిక హక్కుల్లోకి చేరనే లేదు. ఏ మేధావులూ, ప్రగతివాదులూ దీనిపై సీరియస్ గా స్పందించరు. ఇలాంటి సమయంలో ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటో…తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్ ని ప్రకటించింది. దాంతో జొమాటోకి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే పీరియడ్ లీవుని […]
‘మహిళలకు నెలసరి సమయంలో సెలవు ఇవ్వాలి… ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం’… అనే నినాదం ఎప్పటినుండో ఉన్నా ఈ ‘విశ్రాంతి’… అనేది ఏ మానవ హక్కుల్లోకి, ప్రాథమిక హక్కుల్లోకి చేరనే లేదు. ఏ మేధావులూ, ప్రగతివాదులూ దీనిపై సీరియస్ గా స్పందించరు. ఇలాంటి సమయంలో ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటో…తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్ ని ప్రకటించింది. దాంతో జొమాటోకి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.
అయితే పీరియడ్ లీవుని ప్రకటించిన మీదట జొమాటో సిఈఓ దీపీందర్ గోయల్ ఈ విషయం గురించి మాట్లాడిన మాటలు వింటే… నిజంగా మహిళల సమస్య ఆయనకు అర్థమైందా… అర్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నారా… అనే అనుమానం కలుగుతుంది. ‘ఈ లీవులను మహిళా ఉద్యోగులు తమకు నిజంగా అవసరమైతేనే వినియోగించుకోవాలి. వీటిని దుర్వినియోగం చేస్తూ వేరే పనులకు వాడకూడదు. వారు మంచి ఆహారం తీసుకుంటూ ఫిట్ నెస్ కాపాడుకుంటూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారాయన. అంటే నెలసరి సెలవులను వాడే అవసరం రాకుండా చూసుకోవాలనేది ఆయన ఉద్దేశ్యం.
అయితే దీపీందర్ గోయల్ చేసిన ప్రకటనలోని ‘నిజంగా’ అనేపదం… పీరియడ్ లీవులను స్త్రీలు ఉపయోగించుకునే అవకాశం లేకుండా అడ్డుపడేలా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. నెలసరితో ఉన్న మహిళ… తనకు ‘నిజంగా’ సెలవు అవసరం ఉందని ఎలా నిరూపించుకోవాలి… హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కి అలాంటి నమ్మకాన్ని ఎలా కలిగించాలి…. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మంచి తిండి తింటూ వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉంటే… పీరియడ్ లీవ్ లను వాడాల్సిన అవసరం రాదు అన్నట్టుగా ఉన్న దీపీందర్ మాటలపైన కూడా విమర్శలు వస్తున్నాయి. గర్భసంచి అనే అవయవం లేని… పీరియడ్స్ అనే స్థితి ఎలా ఉంటుందో తెలియని మగవారు … మహిళలకు వారి దేహసంబంధమైన స్థితులు, ఆరోగ్యంపై సలహాలు ఇవ్వకూడదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.
గోయల్ లాంటి మగవారు పీరియడ్స్ సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా స్త్రీలకు నెలసరి లీవులను ప్రభుత్వమే చట్ట బద్ధంగా ఇవ్వాలని వాదిస్తున్నారు కొందరు. మొత్తంమీద మగవారు మహిళల మనసులనే కాదు… వారి దేహాలను గురించి కూడా అర్థం చేసుకోలేరని మరో మారు రుజువైంది.