దావూద్‌పై పాకిస్తాన్ ఆంక్షలు
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్టు అంగీకరించింది. ఉగ్రవాదుల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరును చేర్చింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించింది. మాఫియా డాన్ విషయంలో ఇన్నేళ్లు డ్రామాలు ఆడిన పాకిస్తాన్… దావూద్‌పై చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించింది. దావూద్ ఆదాయ మార్గాలపై పాక్ ప్రభుత్వం నిఘా పెట్టబోతోంది. పాకిస్తాన్‌లో దావూద్ ఇకపై స్వేచ్చగా తిరగకుండా ఆంక్షలు విధించింది. 1993 ముంబై పేలుళ్లకు దావూద్ మాస్టర్ మైండ్. పేలుళ్ల తర్వాత […]

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్టు అంగీకరించింది. ఉగ్రవాదుల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరును చేర్చింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించింది.
మాఫియా డాన్ విషయంలో ఇన్నేళ్లు డ్రామాలు ఆడిన పాకిస్తాన్… దావూద్‌పై చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించింది. దావూద్ ఆదాయ మార్గాలపై పాక్ ప్రభుత్వం నిఘా పెట్టబోతోంది. పాకిస్తాన్‌లో దావూద్ ఇకపై స్వేచ్చగా తిరగకుండా ఆంక్షలు విధించింది.
1993 ముంబై పేలుళ్లకు దావూద్ మాస్టర్ మైండ్. పేలుళ్ల తర్వాత అతడు పాకిస్తాన్ పారిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. దావూద్‌తో పాటు 88 మంది ఉగ్రవాద నాయకులు, ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఆంక్షలు విధించింది.
పాకిస్తాన్ విడుదల చేసిన జాబితాలో హఫీజ్ సయూద్, మసూద్ అజర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ పేర్లున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కొత్త జాబితాలోని ఉగ్రవాదులపైనా పాకిస్తాన్ ఆంక్షలు విధించింది.
ఈ ఆంక్షలను అమలు చేయడంలో పాకిస్తాన్ ఎంత వరకు నిజాయితీగా ఉంటుందన్న దానిపై అనుమానాలు ఉన్నాయి.