Telugu Global
International

మాస్క్‌లు అవసరం లేదు... చైనా ప్రభుత్వ నిర్ణయం

చైనాలోని వూహాన్ నగరంలో జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉన్న అమెరికా, బ్రెజిల్, ఇండియా ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. కోవిడ్-19కి ఇంకా సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో అప్పటి వరకు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే వైరస్ పుట్టిన చైనా మాత్రం […]

మాస్క్‌లు అవసరం లేదు... చైనా ప్రభుత్వ నిర్ణయం
X

చైనాలోని వూహాన్ నగరంలో జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉన్న అమెరికా, బ్రెజిల్, ఇండియా ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. కోవిడ్-19కి ఇంకా సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో అప్పటి వరకు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

అయితే వైరస్ పుట్టిన చైనా మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని నిర్ణయించేసింది. దేశ రాజధాని బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత 13 రోజులుగా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే మాస్కులు ధరించవద్దని చెప్పినా స్థానికులు మాత్రం మాస్కుల్లోనే తిరుగుతున్నారు.

బీజింగ్, జిన్జియాంగ్ ప్రాంతాల్లో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. గత వారం రోజులుగా ఇక్కడ కరోనా కేసులు నమోదు కావడం లేదు. గతంలో మాస్క్ ధరించడాన్ని కఠినంగా అమలు చేశారు. అంతే కాకుండా హోం క్వారంటైన్ నిబంధనలు కూడా కఠినంగా ఉండేవి. అందుకే కరోనాను కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాస్కులు వద్దని చెప్పినా ప్రజలే స్వతంత్రంగా ధరిస్తున్నారు. బయట మాస్క్ ధరించకపోతే ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో కూడా ధరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

First Published:  21 Aug 2020 3:46 AM GMT
Next Story