Telugu Global
Cinema & Entertainment

ఆ హీరో ఎవరో తెలిసిపోయింది

జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన లైఫ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ విషయం చెబుతానంటూ కలరింగ్ ఇచ్చాడు సందీప్ కిషన్. దీంతో అతడు పెళ్లి కబురు మోసుకొస్తాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే నిర్మాతగా మరో సినిమా ప్రకటించాడు. అంతేకాదు.. ఆ సినిమాతో ఓ యంగ్ హీరోను పరిచయం చేయబోతున్నట్టు కూడా తెలిపాడు. ఆ యంగ్ హీరో ఎవరనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ప్రస్తుతం కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సత్య ఈ సినిమాతో […]

ఆ హీరో ఎవరో తెలిసిపోయింది
X

జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన లైఫ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ విషయం చెబుతానంటూ కలరింగ్ ఇచ్చాడు సందీప్ కిషన్. దీంతో అతడు పెళ్లి కబురు మోసుకొస్తాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే నిర్మాతగా మరో సినిమా ప్రకటించాడు. అంతేకాదు.. ఆ సినిమాతో ఓ యంగ్ హీరోను పరిచయం చేయబోతున్నట్టు కూడా తెలిపాడు. ఆ యంగ్ హీరో ఎవరనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది.

ప్రస్తుతం కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సత్య ఈ సినిమాతో హీరోగా మారబోతున్నాడు. నిర్మాతగా సందీప్ కిషన్ కు ఇది రెండో సినిమా కాగా.. సత్యకు హీరోగా ఇదే మొదటి సినిమా. ఈ సినిమాకు వివాహభోజనంబు అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

కమెడియన్లు హీరోలుగా మారడం టాలీవుడ్ లో కొత్తకాదు. రాజబాబు కాలం నుంచి ఇదొక ఆనవాయితీగా వస్తోంది. అప్పటి రాజబాబు నుంచి ఇప్పటి అలీ, సునీల్, సప్తగిరి వరకు చాలామంది హీరోల వేషాలు వేశారు. కొందరు క్లిక్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సత్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

First Published:  19 Aug 2020 8:29 PM GMT
Next Story