Telugu Global
Cinema & Entertainment

మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన రకుల్

ఈ లాక్ డౌన్ టైమ్ లో తన జోరు చూపిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆల్రెడీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాల్షీట్లు కూడా కేటాయించిన ఈ పొడుగుకాళ్ల సుందరి, ఇప్పుడు మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పే పనిలో బిజీగా ఉంది. విక్రమ్ కుమార్, నాగచైతన్య కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతోంది. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ను తీసుకునే […]

మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన రకుల్
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో తన జోరు చూపిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆల్రెడీ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాల్షీట్లు కూడా కేటాయించిన ఈ పొడుగుకాళ్ల సుందరి, ఇప్పుడు మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పే పనిలో బిజీగా ఉంది.

విక్రమ్ కుమార్, నాగచైతన్య కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతోంది. కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ను తీసుకునే ప్లాన్స్ లో ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు కాల్షీట్లు ఇస్తానని, రెమ్యూనరేషన్ ను కూడా 25 శాతం తగ్గించుకుంటానని రకుల్ హామీ ఇవ్వడంతో ఆల్ మోస్ట్ ఆమెనే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పైగా చైతూ-రకుల్ కెమిస్ట్రీకి ఆల్రెడీ మంచి ఇమేజ్ ఉంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో వీళ్లిద్దరి జంటకు మంచి మార్కులు పడ్డాయి. సో.. అదే కాంబినేషన్ ను రిపీట్ చేయాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నాడు.

Next Story