Telugu Global
International

మార్పుతో మరింతగా వైరస్ వ్యాప్తి... అయినా మంచిదే!

కరోనా వైరస్ లో వచ్చే మార్పులను గురించి తరచుగా వింటున్నాం. ఇప్పుడు కూడా కరోనాలో మరో కొత్త మార్పు చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ మార్పుని డి614జి గా పిలుస్తున్నారు.  వైరస్ లో చోటు చేసుకునే జన్యుపరమైన మార్పుల వలన… దాని నివారణకు కనిపెడుతున్న వ్యాక్సిన్ పనికిరాకుండా పోతుందనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మార్పు వలన అలాంటి ప్రమాదమేమీ ఉండదని తెలుస్తోంది.  వైరస్ లో వస్తున్న ఈ మార్పు వలన ఇన్ ఫెక్షన్ మరింత […]

మార్పుతో మరింతగా వైరస్ వ్యాప్తి... అయినా మంచిదే!
X

కరోనా వైరస్ లో వచ్చే మార్పులను గురించి తరచుగా వింటున్నాం. ఇప్పుడు కూడా కరోనాలో మరో కొత్త మార్పు చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ మార్పుని డి614జి గా పిలుస్తున్నారు. వైరస్ లో చోటు చేసుకునే జన్యుపరమైన మార్పుల వలన… దాని నివారణకు కనిపెడుతున్న వ్యాక్సిన్ పనికిరాకుండా పోతుందనే అనుమానాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు సంభవిస్తున్న మార్పు వలన అలాంటి ప్రమాదమేమీ ఉండదని తెలుస్తోంది. వైరస్ లో వస్తున్న ఈ మార్పు వలన ఇన్ ఫెక్షన్ మరింత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉన్నా… దాని వలన కలిగే ఆరోగ్య హాని మాత్రం తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.

ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు పాల్ టాంబ్యా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. డి614జి మార్పుతో వైరస్ మరింత ప్రబలమైన అంటువ్యాధిగా మారుతుందని… అయితే దాని తీవ్రత తగ్గి ప్రాణహాని ఉండదని పాల్ అన్నారు. సింగపూర్ జాతీయ యూనివర్శిటీలో సీనియర్ కన్సల్టెంట్ గా ఉన్న పాల్… దీనిపై వివరణ ఇస్తూ… మార్పులు చేసుకున్న అనంతరం వైరస్ తన తీవ్రతని కోల్పోతుందని అన్నారు. ‘వైరస్ మరింత ఎక్కువమందిలోకి చేరాలనుకుంటుంది కానీ… వారిని చంపాలనుకోదు. ఎందుకంటే తాను ఎవరిలో అయితే చేరుతుందో వారే తనకు ఆహారం, ఆశ్రయం ఇస్తున్నారు కనుక…’ అంటూ ఒక కొటేషన్ తో మరింత వివరంగా వెల్లడించారు.

కోవిడ్ 19 లో వచ్చిన డి614జి మార్పుతో అది పదిరెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని, అయితే ఆ మార్పు వ్యాక్సిన్లకు ఆటంకంగా మాత్రం మారదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతున్నదాన్ని బట్టి ఈ మార్పుని శాస్త్రవేత్తలు ఫిబ్రవరిలోనే యూరప్ లో గుర్తించారు. అయితే దీని వలన వైరస్ మరింత హానికరంగా మారలేదు. అలాంటి ఆధారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించలేదు.

Next Story