Telugu Global
National

బాబు సంధి ప్రయత్నాలకు రాష్ట్ర బీజేపీ నేతల మోకాలడ్డు...

బీజేపీకి దూరమయ్యాక చంద్రబాబు బాగా నష్టపోయారు. గత ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా పోటీ చేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అటు కేంద్రంలో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్రమోదీ చల్లనిచూపు కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తిట్టిన నోటితోనే పొగడటం, అదే నోటితో మళ్లీ తిట్టడం చంద్రబాబుకి అలవాటే. ఈ సారి కూడా అవే ప్రయత్నాల్లో ఉన్నారు బాబు. రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే కేంద్రానికి […]

బాబు సంధి ప్రయత్నాలకు రాష్ట్ర బీజేపీ నేతల మోకాలడ్డు...
X

బీజేపీకి దూరమయ్యాక చంద్రబాబు బాగా నష్టపోయారు. గత ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా పోటీ చేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అటు కేంద్రంలో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్రమోదీ చల్లనిచూపు కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తిట్టిన నోటితోనే పొగడటం, అదే నోటితో మళ్లీ తిట్టడం చంద్రబాబుకి అలవాటే. ఈ సారి కూడా అవే ప్రయత్నాల్లో ఉన్నారు బాబు.

రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, అమరావతిపై పితూరీలు చెప్పడం, ప్రధాని చేసిన శంకుస్థాపనను అపహాస్యం చేస్తారా అంటూ మూడు రాజధానులకు వక్రభాష్యాలు చెప్పడం.. ఇవన్నీ బీజేపీకి దగ్గరవడానికి బాబు వేస్తున్న ఎత్తుగడలే.

అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మేం ఆ స్థానాన్ని భర్తీ చేస్తామంటూ బీజేపీ నేతలు మాట్లాడినా కూడా చంద్రబాబు కిక్కురుమనలేదు. బాబుకి కేసుల భయం ఉండనే ఉంది. చిదంబరం లాంటి వారినే తీహార్ జైలుకి పంపించిన చరిత్ర బీజేపీ నాయకులది, చంద్రబాబులాంటి వారు ఒక లెక్కా.

అందుకే బాబు బీజేపీతో సయోధ్యకోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబుకి రాష్ట్ర నాయకత్వంతో చికాకులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీర్రాజు నేరుగా చంద్రబాబు, టీడీపీనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ కూడా ఇటీవల చంద్రబాబు విధానాలని పూర్తి స్థాయిలో ఎండగట్టారు.

ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా.. చంద్రబాబు హడావిడిగా విజయవాడకు ఎందుకు పరిగెత్తుకొచ్చారో అందరికీ తెలుసని చురకలంటించారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు ప్రధాని మోదీకి రాసిన లేఖపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీకి భజన చేసి ప్రసన్నం చేసుకునేలాగా చంద్రబాబు లెటర్ ఉందని చెప్పిన విష్ణు, గతంలో చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో ఉంచి.. బాబు పరువు పూర్తిగా తీసేశారు.

తాజాగా దక్షిణ భారత బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా ఫోన్ ట్యాపింగ్ అంటూ చంద్రబాబు చేస్తున్న హడావిడిని ఎండగట్టారు. 2015లో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వాయిస్ అందరూ విన్నారని, అప్పుడు ఫిర్యాదు చేయని, చంద్రబాబు ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లేఖపై కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని, బాబు కోర్టుకెళ్లాల్సిందేనని తేల్చేశారు.

ఓవైపు చంద్రబాబు బీజేపీతో సంధి ప్రయత్నాలు చేస్తూ, కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలని చూస్తుంటే.. మరోవైపు రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఆయన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారు. ఇన్నాళ్లూ ఏపీలో బీజేపీ ఎదగలేకపోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని, గతంలో బీజేపీలోని ఓ పెద్దాయన హస్తం కూడా అందులో ఉందనే ఆరోపణలున్నాయి.

ఇప్పుడిప్పుడే చంద్రబాబు ధృతాష్ట్ర కౌగిలినుంచి బైటపడటానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాయకత్వాన్ని కూడా ప్రక్షాళణ చేస్తూ, సుజనా చౌదరి లాంటి బాబు భక్తులపై నిఘా పెట్టింది. అయినా కూడా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తుండే సరికి రాష్ట్ర బీజేపీ నేతలు మూకుమ్మడి దాడి మొదలు పెట్టారు. కేంద్రం పొడ సోకనీయకుండా బాబుకి రాష్ట్ర స్థాయిలోనే గట్టి సమాధానాలిస్తున్నారు.

First Published:  18 Aug 2020 8:59 PM GMT
Next Story