Telugu Global
International

ఆస్ట్రేలియాలో... ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ !

తామే సొంతంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ ని తయారుచేసి ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఆక్స్ ఫార్డ్ యూనివర్శిటీతో కలిసి వ్యాక్సిన్ ని రూపొందించిన బ్రిటన్ కి స్వీడన్ కి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికాతో తాము వ్యాక్సిన్ గురించి  ఒప్పందం కుదుర్చుకున్నామని మారిసన్ తెలిపారు. ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో ఆక్స్ ఫార్డ్ వ్యాక్సిన్ మరింత మెరుగైనదని… తాము త్వరగా ఒప్పందం కుదుర్చుకోవటం వలన ప్రతి ఒక్క ఆస్ట్రేలియా పౌరుడికీ […]

ఆస్ట్రేలియాలో... ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ !
X

తామే సొంతంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ ని తయారుచేసి ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఆక్స్ ఫార్డ్ యూనివర్శిటీతో కలిసి వ్యాక్సిన్ ని రూపొందించిన బ్రిటన్ కి స్వీడన్ కి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికాతో తాము వ్యాక్సిన్ గురించి ఒప్పందం కుదుర్చుకున్నామని మారిసన్ తెలిపారు.

ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో ఆక్స్ ఫార్డ్ వ్యాక్సిన్ మరింత మెరుగైనదని… తాము త్వరగా ఒప్పందం కుదుర్చుకోవటం వలన ప్రతి ఒక్క ఆస్ట్రేలియా పౌరుడికీ వ్యాక్సిన్ ని అందించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.

వ్యాక్సిన్ విజయవంతమైన ఫలితాలను ఇస్తే… స్వయంగా తమదేశంలోనే తయారుచేసి 25 మిలియన్ల (రెండున్నరకోట్లు) మంది ఆస్ట్రేలియన్లకు ఉచితంగా అందిస్తామని మారిసన్ పేర్కొన్నారు. మూడు దశల ట్రైల్స్ పూర్తి చేసుకుని మంచి ఫలితాలను ఇస్తున్న ఐదు వ్యాక్సిన్లలో ఆక్స్ ఫార్డ్ వ్యాక్సిన్ సైతం ఒకటి.

మొదట ఈ వ్యాక్సిన్ ని తయారుచేస్తున్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తరువాత మరికొన్ని ఇతర కంపెనీలతో కూడా మాట్లాడుతున్నామని అలాగే తమదేశపు శాస్త్రవేత్తలను సైతం ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నామని మారిసన్ వెల్లడించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ధర విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదు.

అయితే ఈ లోపల ఆస్ట్రేలియా 100 మిలియన్ల నీడిల్స్, సిరంజిల కొనుగోలుపై దృష్టి సారించింది. ఇందుకోసం అమెరికన్ మెడికల్ టెక్నాలజీ కంపెనీ బెక్టాన్ డికిన్సన్ తో 25 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది.

ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ సామర్ధ్యం పూర్తి స్థాయిలో వెల్లడి కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.7బిలియన్ల (ఒక బిలియన్ అంటే వందకోట్లు) వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్లు వచ్చాయి. ఆస్ట్రాజెనికా కంపెనీ అమెరికా, యూరప్, బ్రెజిల్ దేశాలకు సైతం వ్యాక్సిన్ ని అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

First Published:  18 Aug 2020 8:57 PM GMT
Next Story