Telugu Global
International

ఉహాన్ లో కరోనా భయం పోయిందా?!

కరోనా వైరస్ మొట్టమొదట బయటపడిన చైనాలోని ఉహాన్ లో వైరస్ భయం పూర్తిగా పోయినట్టే ఉంది. వేలమంది జనం మాస్కులు లేకుండా వాటర్ పార్క్ లో పార్టీలు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఉహాన్ లోని ప్రసిద్ధమైన మాయా బీచ్ లో జరిగిన ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఫెస్టివల్ లో వేలమంది జనం స్విమ్ సూట్లు, గాగుల్స్ ధరించి… రబ్బరు పడవల మీద విహరిస్తూ ఎంజాయ్ చేశారు. పార్క్ కెపాసిటీలో సగం వరకు నిండిందని స్థానిక మీడియా పేర్కొంది. ఫెస్టివల్ […]

ఉహాన్ లో కరోనా భయం పోయిందా?!
X

కరోనా వైరస్ మొట్టమొదట బయటపడిన చైనాలోని ఉహాన్ లో వైరస్ భయం పూర్తిగా పోయినట్టే ఉంది. వేలమంది జనం మాస్కులు లేకుండా వాటర్ పార్క్ లో పార్టీలు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఉహాన్ లోని ప్రసిద్ధమైన మాయా బీచ్ లో జరిగిన ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఫెస్టివల్ లో వేలమంది జనం స్విమ్ సూట్లు, గాగుల్స్ ధరించి… రబ్బరు పడవల మీద విహరిస్తూ ఎంజాయ్ చేశారు.

పార్క్ కెపాసిటీలో సగం వరకు నిండిందని స్థానిక మీడియా పేర్కొంది. ఫెస్టివల్ కి వచ్చే మహిళలకు డిస్కౌంటు ధరలు సైతం ప్రకటించారు. డాన్సులు పాటలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో వాటర్ పార్క్ మొత్తం మారుమోగిపోగా… అక్కడకు వచ్చినవారు ఎవరూ సామాజిక దూరం పాటించలేదు… మాస్కులు ధరించలేదు.

ఉహాన్లో గత ఏడాది చివర్లో కరోనా వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. కోటికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలో వందల మంది కరోనాతో చనిపోయారు. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. చాలా కఠినంగా లాక్ డౌన్ ని పాటించిన తరువాత ఏప్రిల్ నుండి లాక్ డౌన్ ని ఎత్తివేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జూన్ లో వాటర్ పార్క్ ని తిరిగి తెరిచారు.

ఇప్పుడు ఉహాన్ లో స్థానికంగా కొత్త కరోనా కేసులు కనిపించడంలేదు. మే నెల నుండి ఉహాన్ ని హుబీ రాష్ట్రానికి రాజధానిగా చేశారు. స్థానికంగా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచే లక్ష్యంతో హుబీ ప్రభుత్వం 400 పర్యాటక ప్రదేశాలకు ప్రవేశరుసుముని సైతం రద్దు చేసింది.

First Published:  17 Aug 2020 8:21 AM GMT
Next Story