Telugu Global
Cinema & Entertainment

నటుడు రాజాకు త్వరలో పెళ్లి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు, నటుడు రాజా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇతడి ఎంగేజ్ మెంట్ రీసెంట్ గా పూర్తయింది. కాకపోతే ఆ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించారు. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జరిగిన రోజునే రాజా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ తనకు పెళ్లి కుదిరిందని, నిశ్చితార్థం కూడా పూర్తయిందనే విషయాన్ని ఈ నటుడు కాస్త ఆలస్యంగా బయటపెట్టాడు. ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ నటుడు.. జీవితంలో […]

నటుడు రాజాకు త్వరలో పెళ్లి
X

సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు, నటుడు రాజా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇతడి ఎంగేజ్ మెంట్ రీసెంట్ గా పూర్తయింది. కాకపోతే ఆ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించారు.

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జరిగిన రోజునే రాజా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ తనకు పెళ్లి కుదిరిందని, నిశ్చితార్థం కూడా పూర్తయిందనే విషయాన్ని ఈ నటుడు కాస్త ఆలస్యంగా బయటపెట్టాడు. ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ నటుడు.. జీవితంలో ఓ కొత్త దశలోకి ప్రవేశించబోతున్నట్టు ప్రకటించాడు.

రాజాది పెద్దలు కుదిర్చిన వివాహం. స్వయంగా సీతారామశాస్త్రి తన బంధుగణం మొత్తాన్ని జల్లెడ పట్టి ఈ సంబంధం కుదిర్చారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో పెళ్లి ఉండొచ్చు.

తెలుగులో ఫిదా, అంతరిక్షం, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా. నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతడికి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

First Published:  16 Aug 2020 10:32 PM GMT
Next Story