Telugu Global
International

విదేశాలకు వెళ్లకుండానే... అక్కడున్నట్టుగా సినిమా!

భారతదేశంలో మొట్టమొదటి వర్చువల్ సినిమా రాబోతోందని….అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని సదరు సినిమాని రూపొందిస్తున్నవారు ప్రకటించారు. దీని దర్శకుడు గోగుల్ రాజ్ భాస్కర్. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి ఇదొక సరికొత్త అధ్యాయమని పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అసలు వర్చువల్ విధానంలో సినిమా నిర్మాణం ఎలా జరుగుతుంది… అనే అంశం గురించి… విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు […]

విదేశాలకు వెళ్లకుండానే... అక్కడున్నట్టుగా సినిమా!
X

భారతదేశంలో మొట్టమొదటి వర్చువల్ సినిమా రాబోతోందని….అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని సదరు సినిమాని రూపొందిస్తున్నవారు ప్రకటించారు. దీని దర్శకుడు గోగుల్ రాజ్ భాస్కర్. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి ఇదొక సరికొత్త అధ్యాయమని పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అసలు వర్చువల్ విధానంలో సినిమా నిర్మాణం ఎలా జరుగుతుంది… అనే అంశం గురించి…

విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేయటం… ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కాస్త భారీ స్థాయిలో తీసే ప్రతిసినిమా షూటింగ్ ఎంతో కొంత విదేశాల్లో జరుగుతుంటుంది. కరోనా వలన ఇప్పుడు మన జీవితాల్లో ఏ ప్రయాణాలు, ప్రమోదాలు లేవు. ఎక్కడి వాళ్లక్కడే గప్ చుప్… అన్నట్టుగా బతికేస్తున్న పరిస్థితుల్లో ఇక విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేయటం కష్టమే. అయితే ఏ కొత్త ప్రదేశాలకు వెళ్లకుండానే అక్కడికి వెళ్లినట్టుగా సినిమాలు తీసే అవకాశం కల్పిస్తోంది వర్చువల్ టెక్నాలజీ.

నటీనటులు ఇక్కడ స్టూడియోలో పాటకు డాన్స్ చేస్తుంటే… విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వారు ఏ స్విట్జర్లాండ్ లోనో ఉన్నట్టుగా తెరపైన కనబడుతుంది. సజీవ పాత్రలు, కంప్యూటర్ రెండూ కలిసి చేసే మేజిక్ అన్నమాట. కరోనా కారణంగా స్థంభించి పోయిన ప్రపంచంలో ముందు ముందు సినిమాలు ఇలాగే నిర్మితమవుతాయని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హాలీవుడ్ లో ఈ తరహా టెక్నాలజీతో సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇవి అంతగా విజయవంతం కావటం లేదు. నటీనటులకు కూడా ఈ తరహా సినిమా మేకింగ్ నచ్చటం లేదు. అయినా ఈ విధానంలో సినిమాలు తీయటం తప్పేలా లేదు.

కరోనా కాలంలో వర్చువల్ ప్రొడక్షన్, ఫిజికల్ ప్రొడక్షన్ కలిసిమెలసి సాగాల్సిందేనని…ఆస్కార్ కి నామినేట్ అయిన విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గే విలియమ్స్ అంటున్నాడు. ఇప్పుడు వీడియో గేమింగ్ కంపెనీలు వర్చువల్ సినిమా మేకింగ్ లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నాయి. 2009లో వచ్చిన అవతార్ సినిమా వర్చువల్ విధానంలో తీసినదే. దీనిని వర్చువల్ ఫాంటసీగా చెబుతారు.

అయితే వర్చువల్ విధానంలో సినిమా తీయటం అంత సులభమేమీ కాదు. పైగా ఖర్చు కూడా ఎక్కువే. కంప్యూటర్ ఇమేజ్ లను, నటీనటులు నటించే ఇమేజ్ లను సమన్వయం చేయటంలో అత్యంత శ్రమ ఉంటుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే….

న్యూజీల్యాండ్ లోని ఆకుపచ్చని అందమైన ప్రకృతిలో ఒక పాటని చిత్రీకరించాలని స్పెయిన్ లో ఉన్న ఒక దర్శకుడు అనుకున్నాడనుకోండి. అక్కడి ప్రకృతిలో ఇక్కడి నటీనటులు పాడుతున్నట్టుగా అత్యంత సహజంగా కనిపించడానికి హొలోలెన్స్ అనే మిక్స్ డ్ రియాలిటీ టెక్నాలజీని వాడతారు. ఇదంతా అంత సులువు కాదు…ఇందుకోసం సినిమా డైరక్టర్… లండన్ లో ఉన్న ఒక ప్రొడక్షన్ డిజైనర్ ని నియమించుకుంటాడు. వీళ్లందరూ జూమ్ యాప్ లో, లేదా ఫేస్ టైమ్ లో నిరంతరం చర్చించుకుంటూ ముందుకు వెళ్లాలి…. ఇలా సాగుతుంది వర్చువల్ సినిమా నిర్మాణం. ఏదేమైనా ఇకముందు మనదేశంలో కూడా ఇలాంటి సినిమాల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది.

First Published:  17 Aug 2020 2:15 AM GMT
Next Story