Telugu Global
National

రామ్‌కు ఏపీ పోలీసుల వార్నింగ్

నటుడు రామ్‌కు ఏపీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి ఉదంతంలో విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తే నటుడు రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా వద్ద స్పష్టం చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద వ్యవహారంలో రమేష్ హస్పటల్‌కు మద్దతుగా జోక్యం చేసుకుంటున్న సినీ హీరో రామ్‌కు ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విచారణకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. విచారణకు ఆటంకం కలిగిస్తే నటుడు రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని […]

రామ్‌కు ఏపీ పోలీసుల వార్నింగ్
X

నటుడు రామ్‌కు ఏపీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి ఉదంతంలో విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తే నటుడు రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా వద్ద స్పష్టం చేశారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద వ్యవహారంలో రమేష్ హస్పటల్‌కు మద్దతుగా జోక్యం చేసుకుంటున్న సినీ హీరో రామ్‌కు ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విచారణకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. విచారణకు ఆటంకం కలిగిస్తే నటుడు రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి కోవిడ్‌ సెంటర్ పెట్టడానికి ముందు అక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసిందని.. అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ఏం చేసేవారని రామ్ ప్రశ్నించడంపై ఏసీపీ సూర్యచంద్రరావు తీవ్రంగా స్పందించారు. రామ్‌ అంటే ఎవరో తొలుత తనకు తెలియదని.. ఆ తర్వాత అతడు సినీ నటుడని చెప్పారన్నారు. విమర్శలు చేస్తూ ట్వీట్ చేసిన రామ్ … క్వారంటైన్ సెంటర్‌కు, కోవిడ్ కేర్ సెంటర్‌ను తేడా తెలుసుకోవాలని సూచించారు.

ప్రమాదం జరిగిన రోజు కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన రమేష్ బాబు సొంత కారును అక్కడే వదిలేసి వేరే కారులో పారిపోయాడని ఏసీపీ వివరించారు. పరారీలో ఉంటూ దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహరిస్తామని చెప్పడం సరికాదన్నారు.

రమేష్ బాబు కోసం ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణలో పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్టు చెప్పారు. రమేష్ ఆస్పత్రి ఏఏ అనుమతులు తీసుకుంది… ఏఏ ఒప్పందాలు చేసుకుంది అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఒప్పందాలు చేసుకున్నామని చెబుతున్నా… ఇప్పటి వరకు వాటిని మాత్రం చూపించడం లేదన్నారు.

First Published:  16 Aug 2020 7:59 AM GMT
Next Story