Telugu Global
National

రాష్ట్రం కోసం అక్కడి ప్రతిపక్షాలు.... బాబుకోసం ఇక్కడి ప్రతిపక్షాలు

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి.  ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు […]

రాష్ట్రం కోసం అక్కడి ప్రతిపక్షాలు.... బాబుకోసం ఇక్కడి ప్రతిపక్షాలు
X

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి, నాగం మాట్లాడడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఒక్కటే మాట్లాడితే తమని ప్రజలు తప్పుగా భావిస్తారని బిజెపీ నేతలు కూడా గళం విప్పారు. ఇప్పుడు వారికి ఏపీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం అయ్యారు.

తనతో పాటు తనకు వంతపాడే సిపీఐ, కాంగ్రెస్, బీజెపిలోని తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కో రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎద్దు ఈనింది అంటే గాటన కట్టేయండి అన్నట్లుగా చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .

ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సిఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో తెలంగాణాలో కాంగ్రెస్ లోని గ్రూపులు, బి జె పీ నేతలు ఇటు ఏ పీ, అటు తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తుండటంతో స్పందించక తప్పని పరిస్థితి నెలకొనటం తో ఏ పీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచకపోయినా పర్వాలేదు గానీ… నష్టం కలిగించేలా వ్యహరించకుండా ఉండాల్సిన చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణాలో తమ భావజాలాలు, అభిప్రాయాలు విభిన్నమైనప్పటికీ అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, నా అనుభవం అంత లేదు మీ వయస్సు అని చెప్పే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా భజన బృందం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తు ఆ విధంగా ముందుకు పోతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయరు. సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని పట్టించుకోరు. అందుకు పోలవరమే ఉదాహరణ. రాయలసీమ ఏడారిగా మారడమే ఆయన చేసిన అభివృద్ధికి అద్దం పడుతుంది.

ఇక ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు గొప్పతనం.

Next Story