Telugu Global
National

ఆన్ లైన్ పాఠం... వినూత్న ఉపాయం !

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులవైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రయత్నమైతే చేస్తున్నారు కానీ… అందుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆన్ లైన్ పాఠాలు సవ్యంగా సాగాలంటే… స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ కనెక్షన్లు అందరికీ అందుబాటులో ఉండాలి. పిల్లలు ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడి, వాటిని ఏకాగ్రతగా వినగలగాలి. పిల్లలు ఎదురుగా లేకపోయినా వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పగల అవగాహన టీచర్లకు ఉండాలి… ఇందులో ఏవి లేకపోయినా ఈ విధానం […]

ఆన్ లైన్ పాఠం... వినూత్న ఉపాయం !
X

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులవైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రయత్నమైతే చేస్తున్నారు కానీ… అందుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆన్ లైన్ పాఠాలు సవ్యంగా సాగాలంటే… స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ కనెక్షన్లు అందరికీ అందుబాటులో ఉండాలి. పిల్లలు ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడి, వాటిని ఏకాగ్రతగా వినగలగాలి. పిల్లలు ఎదురుగా లేకపోయినా వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పగల అవగాహన టీచర్లకు ఉండాలి… ఇందులో ఏవి లేకపోయినా ఈ విధానం వలన ప్రయోజనం ఉండదు.

ఇలాంటి నేపథ్యంలో టీచర్లు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది టీచర్లు మరింతగా ఆలోచించి ఈ ప్రక్రియను తేలిక చేసే మార్గాలు, ఉపాయాలను అన్వేషిస్తున్నారు. అలాంటి వినూత్న ప్రయత్నాలు సోషల్ మీడియాలోకి ఎక్కి నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నాయి.

ట్విట్టర్లో పోస్టయిన అలాంటి ఉపాయం తాలూకూ ఫొటో ఒకటి 4,400పైగా లైకులతో, వందల కొద్దీ రీట్వీట్లు, కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్విట్టర్లో పోస్టయిన ఈ ఫొటోలో ఒక టీచరు రిఫ్రిజిరేటర్ ట్రేని వినియోగించి ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పటం కనబడుతోంది. పారదర్శకంగా ఉన్న ట్రేని రెండు డబ్బాలపై ఉంచి దానిపైన వీడియో ఆన్ చేసిన ఫోన్ ని ఉంచింది. ట్రే కింద పేపరు పెట్టి… ఆ పేపరుపైన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ టీచ్ చేస్తోంది ఆమె.

ఫోన్లోని వీడియో ఆన్ లో ఉండటం వలన ఆ పేపరుపైన రాస్తున్నదంతా నేరుగా పిల్లలకు కనిపించే అవకాశం కలిగింది. ఒక చేత్తో ఫోన్ ని పట్టుకుని మరో చేత్తో రాసే అవసరం లేకుండా… ఫోన్ ని చేత్తో పట్టుకోకుండానే రికార్డు అయ్యేలా, అది స్పష్టంగా పిల్లలకు కనిపించేలా చేయగలిగింది. అందుకే ఆమె ఉపాయం నెటిజన్లకు బాగా నచ్చేసింది. తమకు తోచిన ఉపాయాలతో పిల్లలకు అర్ధమయ్యేలా పాఠాలు చెప్పాలని తపిస్తున్న ఇలాంటి టీచర్లు నిజంగా ఇతర ఉపాధ్యాయులకు మార్గదర్శకులనే చెప్పాలి.

First Published:  11 Aug 2020 10:08 PM GMT
Next Story