Telugu Global
National

రామోజీరావుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌కు స్పందించిన సుప్రీం కోర్టు రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్దంగా రెండువేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి ద్వారా రామోజీరావు సేకరించారు. ఈ అంశాన్ని తొలుత ఉండవల్లి అరుణ్‌ కుమార్ వెలుగులోకి తెచ్చారు. 2006లో కేసు నమోదు అయింది. 2008లో చార్జీషీట్ […]

రామోజీరావుకు సుప్రీం నోటీసులు
X

మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌కు స్పందించిన సుప్రీం కోర్టు రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్దంగా రెండువేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి ద్వారా రామోజీరావు సేకరించారు. ఈ అంశాన్ని తొలుత ఉండవల్లి అరుణ్‌ కుమార్ వెలుగులోకి తెచ్చారు. 2006లో కేసు నమోదు అయింది. 2008లో చార్జీషీట్ దాఖలు చేశారు. కానీ కోర్టుల్లో విచారణ మాత్రం జరగలేదు. కింది కోర్టులో ట్రయల్ జరకుండా హైకోర్టులో రామోజీ స్టే తెచ్చుకున్నారు. చాలా ఏళ్ల పాటు స్టే మీద విచారణ నిలిచిపోయింది.

ఆరు నెలలకు మించి ఏ కేసులోనూ స్టే ఉండడానికి వీల్లేదని 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో తిరిగి ఈ కేసులో కదలిక వచ్చింది. ఇంతలో 2018లో ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు కీలక పరిణామం జరిగిపోయింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు రామోజీ రావుపై కేసును హైకోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ విషయం చాలా రోజులు బయటకు రాలేదు. చివరకు హైకోర్టు విభజన ఆఖరి రోజు కేసు కొట్టేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఉండవల్లి పిటిషన్‌పై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నేరం రుజువైతే ఏడు వేల కోట్ల రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రెండున్నరేళ్లు జైలు శిక్ష పడుతుంది.

First Published:  10 Aug 2020 5:46 AM GMT
Next Story