Telugu Global
NEWS

వైసీపీ నేత పెనుమత్స కన్నుమూత

వైసీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. పెనుమత్స 8సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ మంత్రిగా పనిచేశారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయనగరం జిల్లా గజపతినగరం, సతివాడ నియోజకవర్గాల నుంచి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణకు పెనుమత్స సాంబశివరాజు రాజకీయ గురువుగా చెబుతుంటారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అనేక మంది నాయకులను రాజకీయాలకు […]

వైసీపీ నేత పెనుమత్స కన్నుమూత
X

వైసీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. పెనుమత్స 8సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ మంత్రిగా పనిచేశారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయనగరం జిల్లా గజపతినగరం, సతివాడ నియోజకవర్గాల నుంచి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

మంత్రి బొత్స సత్యనారాయణకు పెనుమత్స సాంబశివరాజు రాజకీయ గురువుగా చెబుతుంటారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అనేక మంది నాయకులను రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తిగా పెనుమత్సకు పేరుంది.

ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో కొద్దికాలంగా సాంబశివరాజు రాజకీయాల్లో చురుగ్గా ఉండలేకపోయారు. పెనుమత్స మృతికి పలువురు వైసీపీ నాయకులు సంతాపం తెలిపారు.

First Published:  9 Aug 2020 11:21 PM GMT
Next Story