Telugu Global
Cinema & Entertainment

సుశాంత్ పై కృతి సనన్ పోస్ట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కేసుపై స్పందిస్తున్నారు. మరోవైపు కేసు సీబీఐకి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కృతి సనన్ ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. సుశాంత్ మరణంపై ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, అంతా సహనంగా ఉండాలని తనదైన శైలిలో రాసుకొచ్చింది. “మబ్బులు కమ్ముకున్నాయి. పొగమంచు వల్ల ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ నిజం […]

సుశాంత్ పై కృతి సనన్ పోస్ట్
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కేసుపై స్పందిస్తున్నారు. మరోవైపు కేసు సీబీఐకి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కృతి సనన్ ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. సుశాంత్ మరణంపై ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, అంతా సహనంగా ఉండాలని తనదైన శైలిలో రాసుకొచ్చింది.

“మబ్బులు కమ్ముకున్నాయి. పొగమంచు వల్ల ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ నిజం మాత్రం సూర్యుడు లాంటిది. అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. కాబట్టి డౌట్స్ వద్దు, ఓపిగ్గా ఉండాలి. కాసేపు గాలి, వర్షం ఉండొచ్చు కానీ సూర్యుడి ప్రకాశం మాత్రం తగ్గదు.”

ఇలా సుశాంత్ మరణంపై పోస్టు పెట్టింది కృతిసనన్. సుశాంత్ తో కలిసి రబ్తా సినిమా చేసింది కృతి సనన్. ఆ టైమ్ లోనే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి అంత్యక్రియలకు హాజరైన అతికొద్ది మంది సినీప్రముఖుల్లో కృతి సనన్ ఒకరు.

First Published:  9 Aug 2020 8:28 PM GMT
Next Story