Telugu Global
National

సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

మూడు రాజధానుల చట్టం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని పిటిషన్‌లో సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారని… నిజానికీ ఆ చట్టాల ద్వారా రైతుల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం పరిరక్షించిందని పిటిషన్‌లో వివరించారు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ […]

సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
X

మూడు రాజధానుల చట్టం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని పిటిషన్‌లో సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారని… నిజానికీ ఆ చట్టాల ద్వారా రైతుల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం పరిరక్షించిందని పిటిషన్‌లో వివరించారు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏ మాత్రం నిలవజాలవని తన పిటిషన్లో అభిప్రాయపడింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు అవసరమైన కనీస ప్రాథమిక ఆధారాలను కూడా పిటిషన్లు హైకోర్టుకు చూపించలేకపోయారని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

న్యాయ స్థానాలు అంతిమ విచారణ జరిపి చట్టాల రాజ్యాంగబద్ధతను తేల్చే వరకు శాసన వ్యవస్థలు చేసిన చట్టాలను రాజ్యాంగబద్దమైనవిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది ముఖ్యమైన న్యాయసూత్రమని తన పిటిషన్‌లో ఏపీ సీఎస్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్‌ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించగానే కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వెంటనే హైకోర్టు స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

First Published:  8 Aug 2020 4:09 AM GMT
Next Story