Telugu Global
NEWS

జైలు నుంచి విడుదల కాగానే సీఐపై ప్రభాకర్ రెడ్డి బూతుల దాడి

నకిలీ ఇన్సూరెన్స్‌ల కేసులో అరెస్ట్ అయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డితో పాటు కడప జైలు నుంచి విడుదలయ్యారు. 54 రోజుల పాటు జైలులో ఉన్నాకూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అనుచరులు వచ్చారు. వందలాది వాహనాలతో తాడిపత్రికి వచ్చారు. సజ్జనదిన్నె వద్దకు రాగానే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి […]

జైలు నుంచి విడుదల కాగానే సీఐపై ప్రభాకర్ రెడ్డి బూతుల దాడి
X

నకిలీ ఇన్సూరెన్స్‌ల కేసులో అరెస్ట్ అయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డితో పాటు కడప జైలు నుంచి విడుదలయ్యారు. 54 రోజుల పాటు జైలులో ఉన్నాకూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అనుచరులు వచ్చారు. వందలాది వాహనాలతో తాడిపత్రికి వచ్చారు. సజ్జనదిన్నె వద్దకు రాగానే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి అక్కడే విధుల్లో ఉన్న సీఐపై విరుచుకుపడ్డారు. నీ అబ్బా అంటూ సీఐను బూతులు తిట్టారు. ఏ చేస్తావ్‌.. అరెస్ట్ చేస్తావా… నీ అబ్బా అంటూ సీఐ దేవేంద్రను దూషించారు.

ఇంతలో కేకలు వేస్తూ జేసీ అనుచరులు ఒక్కసారిగా పోలీసులపైకే పరుగులు తీశారు. జై జేసీ అంటూ పోలీసులను రోడ్డుపై తరిమారు. చివరకు పోలీసులే వెనక్కు తగ్గారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళ్లారు. చాలాసేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. జేసీ తమను బూతులు తిడుతున్నా సీఐతో పాటు పోలీసులు ఏమీ చేయలేకపోక మౌనంగా ఉండిపోయారు.

తాము ప్రతిఘటిస్తే ఉన్నతాధికారుల నుంచి లేనిపోని ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో పోలీసులు మౌనంగా ఉండిపోయినట్టు చెబుతున్నారు. విధుల్లో ఉన్న సీఐను బూతులు తిట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేస్తారా లేక సర్దుకుపోతారా అన్నది చూడాలి.

First Published:  6 Aug 2020 10:49 PM GMT
Next Story