Telugu Global
NEWS

అమరావతిపై కేంద్రం సంచలన అఫిడవిట్

రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందంటూ హైకోర్టులో ఇది వరకు కొందరు పిటిషన్లు వేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలని ఇటీవల హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. […]

అమరావతిపై కేంద్రం సంచలన అఫిడవిట్
X

రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందంటూ హైకోర్టులో ఇది వరకు కొందరు పిటిషన్లు వేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలని ఇటీవల హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర ఉండదని హోంశాఖ తన అఫిడవిట్‌లో వివరించింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ … కోర్టుల పరిధిలో న్యాయ సమీక్షకు రాదు అని కూడా కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

గతంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్న సమయంలోనూ అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే జరిగిందని… అందులో కేంద్రం జోక్యం చేసుకోలేదని గుర్తు చేసింది.

First Published:  6 Aug 2020 3:10 AM GMT
Next Story