Telugu Global
International

పాక్‌ వింత మ్యాప్‌

పాకిస్తాన్‌ తీరని ముచ్చట తీర్చుకునేందుకు ఊహల్లో విహరిస్తోంది. కొత్తగా పాకిస్తాన్‌ విడుదల చేసిన మ్యాప్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను భారత్‌ రద్దు చేసి ఏడాది అవుతున్న తరుణంలో పాకిస్తాన్‌ తన దేశానికి సంబంధించి కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో జమ్ము, కశ్మీర్, లడఖ్‌ ప్రాంతాలనూ తన దేశంలో భాగంగా పాకిస్తాన్ ‌చూపుకుంది. ఈ మ్యాప్‌కే పాకిస్తాన్‌ కేబినెట్‌ ఆమోదముద్ర కూడా వేసింది. ఈ కొత్త మ్యాప్‌ పాక్ చరిత్రలో కొత్త అధ్యాయమని […]

పాక్‌ వింత మ్యాప్‌
X

పాకిస్తాన్‌ తీరని ముచ్చట తీర్చుకునేందుకు ఊహల్లో విహరిస్తోంది. కొత్తగా పాకిస్తాన్‌ విడుదల చేసిన మ్యాప్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను భారత్‌ రద్దు చేసి ఏడాది అవుతున్న తరుణంలో పాకిస్తాన్‌ తన దేశానికి సంబంధించి కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.

ఇందులో జమ్ము, కశ్మీర్, లడఖ్‌ ప్రాంతాలనూ తన దేశంలో భాగంగా పాకిస్తాన్ ‌చూపుకుంది. ఈ మ్యాప్‌కే పాకిస్తాన్‌ కేబినెట్‌ ఆమోదముద్ర కూడా వేసింది. ఈ కొత్త మ్యాప్‌ పాక్ చరిత్రలో కొత్త అధ్యాయమని ఆ దేశం ప్రకటించుకుంది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాన్నీ తమ మ్యాప్‌లో కలిపేసుకుంది. ఈ చర్యను భారత్ లైట్ తీసుకుంది. ఎలాంటి అంతర్జాతీయ గుర్తింపు లేకుండా పక్కదేశానికి సంబంధించిన ప్రాంతాలను తమ దేశంలో అంతర్బాగం అని మ్యాప్‌లో చెప్పుకునే పాకిస్తాన్‌ ప్రయత్నం హాస్యాస్పదంగా ఉందని భారత్ వ్యాఖ్యానించింది.

First Published:  4 Aug 2020 8:38 PM GMT
Next Story