Telugu Global
National

సివిల్స్‌లో తెలుగువారి సత్తా... టాపర్‌ ధాత్రిరెడ్డి, కడప జిల్లాకు ఐదు ర్యాంకులు

దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్‌ -2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 50 మంది ఈసారి ఎంపికయ్యారు. తక్కువ పోస్టులు ఉన్నా ఈసారి భారీగానే తెలుగువారు సివిల్ సర్వీసెస్ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావికి చెందిన ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో…. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యున్నత ర్యాంకును సాధించారు. 2018 పరీక్షల్లోనే ఆమె 233వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఖమ్మం […]

సివిల్స్‌లో తెలుగువారి సత్తా... టాపర్‌ ధాత్రిరెడ్డి, కడప జిల్లాకు ఐదు ర్యాంకులు
X

దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్‌ -2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 50 మంది ఈసారి ఎంపికయ్యారు. తక్కువ పోస్టులు ఉన్నా ఈసారి భారీగానే తెలుగువారు సివిల్ సర్వీసెస్ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావికి చెందిన ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో…. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యున్నత ర్యాంకును సాధించారు.

2018 పరీక్షల్లోనే ఆమె 233వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో శిక్షణ ఐపీఎస్‌ అధికారిణిగా ధాత్రిరెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్‌కు వెళ్తున్నారు.

గుంటూరుకు చెందిన మల్లవరపు సూర్యతేజ జాతీయ స్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. ఐదో ప్రయత్నంలో సూర్యతేజ విజయం సాధించారు. హైదరాబాద్‌ రామంతాపూర్‌కు చెందిన కట్టా రవితేజ మూడో ప్రయత్నంలో 77వ ర్యాంకు సాధించారు.

సివిల్ సర్వీసెస్ ర్యాంకుల్లో కడప జిల్లా కుర్రాళ్లు దుమ్మురేపారు. జిల్లా నుంచి ఐదుగురు ర్యాంకులు సాధించారు. కడప జిల్లాకు చెందిన రుషికేష్ రెడ్డి జాతీయ స్థాయిలో 95వ ర్యాంకు సాధించారు. రుషికేష్‌ రెడ్డి వయసు 25 ఏళ్లు. కడప జిల్లాకే చెందిన రాహుకుమార్‌ రెడ్డి జాతీయ స్థాయిలో 117వ ర్యాంకు సాధించారు. ఇతడిది కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని నంది గ్రామం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. రాహుల్‌ కుమార్ రెడ్డికి ఈనెల 8న వివాహం నిశ్చయం అయింది.

మైదుకూరుకు చెందిన చీమల శివగోపాల్ రెడ్డి సివిల్స్‌లో 263వ ర్యాంకు సాధించారు. రాజంపేటకు చెందిన తేజ్‌దీపక్‌ 279 ర్యాంకును సొంతం చేసుకున్నారు. పోరుమామిళ్ల మండలానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి సివిల్స్‌లో 314వ ర్యాంకును సాధించారు. వెంకటేశ్వరరెడ్డి రెండేళ్ల క్రితం గ్రూప్‌-1 పరీక్షల్లో ర్యాంకు సాధించారు. బిట్స్ పిలానీలో చదివారు. కర్నూలు సమీపంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన కులదీప్‌ సివిల్ సర్వీసెస్‌లో 135వ ర్యాంకు సాధించారు. 2018లో కులదీప్‌ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

First Published:  4 Aug 2020 8:56 PM GMT
Next Story