Telugu Global
NEWS

కరోనా రోగులకోసం అనంత... రాజకీయ స్వార్ధం కోసం టీడీపీ...

వైద్యులు సైతం తమ ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ చికిత్స చేసేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో వైద్యులతో పాటు అందరిలో ఆత్మస్థైర్యం కల్పించడమే లక్ష్యంగా అనంతపురం అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి  ధైర్యంగా కరోనా రోగుల ముందుకు వెళ్తున్నారు, వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. కష్టసమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే తమవంతు బాధ్యతగా ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో చేతులెత్తేసింది. ఆ పార్టీతో పాటు వారికి అనుంబంధంగా ఉన్న ఎల్లో మీడియ… ఎమ్మెల్యే […]

కరోనా రోగులకోసం అనంత... రాజకీయ స్వార్ధం కోసం టీడీపీ...
X

వైద్యులు సైతం తమ ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ చికిత్స చేసేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో వైద్యులతో పాటు అందరిలో ఆత్మస్థైర్యం కల్పించడమే లక్ష్యంగా అనంతపురం అధికార పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి ధైర్యంగా కరోనా రోగుల ముందుకు వెళ్తున్నారు, వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.

కష్టసమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే తమవంతు బాధ్యతగా ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో చేతులెత్తేసింది. ఆ పార్టీతో పాటు వారికి అనుంబంధంగా ఉన్న ఎల్లో మీడియ… ఎమ్మెల్యే అనంత చేసిన వ్యాఖ్యలను మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి.

పార్టీలో విశ్వసనీయతతో విధేయతగా ఉండే అనంత ప్రజా సమస్యలపై నిరంతరం అధికారంలో ఉన్నా, లేకున్నా అధికారులపై, ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. అదే సమయంలో ధైర్యంగా కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి ఎవరూ చేయలేని పని ఆయన చేశారు. ఏ సందర్భంలోనూ పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు, ఓ వర్గం మీడియా మాత్రం కరోనా రోగులకు సరైన సౌకర్యాలు అందడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటూ చితివద్ధ చలికాచుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి.

జిల్లాలో అనంత అగ్రభాగంలో ధైర్యంగా కోవిడ్ బాధితుల కోసం అండగా నిలబడి పనిచేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు, నర్సుల్లో ఆత్మస్థైర్యం కలిగిస్తూ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు.

కరోనా భయంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఇళ్లకే పరిమితం…

జిల్లా అధికారులు, డాక్టర్లు కూడా భయపడుతున్న సందర్భంలో కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న వార్డుల్లోకెళ్లి రోగులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా వుంటున్నారు ఎమ్మెల్యే అనంత. ఆ వెంటనే జిల్లా అధికార్లు కూడా కోవిడ్ సెంటర్లలోకి వెళ్ళి బాధితులకు భరోసా ఇస్తున్నారు. అందుకే వారి చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది. అనంత అధికారులకు వారిబాధ్యతలను గుర్తుచేస్తూనే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలక్రిష్ణకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా…. ఈ కరోనా సమయంలో జిల్లాకు ముఖం చాటేశారు. నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడడం లేదు. తెలుగుదేశం వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

అనంతపురం వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని, వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, ప్రభుత్వం కరోనా రోగులకు భోజనం కోసం రోజుకు 500 రూపాయలు కేటాయిస్తున్నా… నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి సీరియస్‌‌ అయ్యారు. సోమవారం అనంతపురం జీజీహెచ్‌లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదని, వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలని, ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం చేస్తున్నారని వారిని నిలదీశారు.

మానవతా దృక్పథంతో కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదని, కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్‌కు రూ. 5,000 వసూలు చేస్తుండడంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ వారియర్స్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా ఉన్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు.

మానవత్వంతో కూడిన సేవలు లేవు

ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దాదాపు 420 బెడ్లు ఉన్నా.. మాకు వద్దు అనే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి రెండున్నర గంటల పాటు పరిశీలించి కోవిడ్ బాధితులతో మాట్లాడారు. సిస్టర్స్ ఎవరూ రావడం లేదని బాధితులు వాపోయారు.

జిల్లాలో ఒక్క ఆర్డీటీ ఆస్పత్రిలో తప్ప తక్కిన ఆస్పత్రుల్లో భోజనం నాణ్యతగా ఉండడం లేదని, ఆర్డీటీతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోనే సౌకర్యాలు, స్పెషలిస్టు డాక్టర్లున్నారు. కానీ ఇక్కడ మానవత్వంతో కూడిన సేవలందడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు కనీసం గదుల్లోకి కూడా వెళ్లడం లేదని, కరోనా పాజిటివ్ అని ఫలితం రాగానే ప్రజలు భయపడుతున్నారని, సగం ప్రాణాలు భయంతోనే పోతున్నాయన్నారు.

ఇక కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద కనీసం 40 కరోనా కేసు లను కూడా చేర్చుకోలేదు. ప్రైవేటుగా చేరితే మూడు నాలుగు రోజులకు రూ.1.30 లక్షల దాకా బిల్లు వేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని సమీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

First Published:  5 Aug 2020 3:50 AM GMT
Next Story