Telugu Global
International

అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌... ఆసుపత్రిలో చేరిక !

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్‌ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని…ఆందోళన చెందొద్దని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు అమిత్‌ షా చెప్పారు. అమిత్‌ షాకు కరోనా వచ్చిందని ఇంతకుముందు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన అప్పట్లో ఖండించారు. ఈ మధ్య ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సౌకర్యాలను అమిత్‌షా […]

అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌... ఆసుపత్రిలో చేరిక !
X

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్‌ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని…ఆందోళన చెందొద్దని కోరారు.

డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు అమిత్‌ షా చెప్పారు. అమిత్‌ షాకు కరోనా వచ్చిందని ఇంతకుముందు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన అప్పట్లో ఖండించారు. ఈ మధ్య ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సౌకర్యాలను అమిత్‌షా పరిశీలించారు. ఈ సందర్భంలోనే ఆయనకు కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు కరోనాతో నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌కు టెస్టులు నిర్వహించారు. ఆయనకు నెగటివ్‌ వచ్చింది. దీంతో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఇప్పటికే కోడలు ఐశ్వర్యారాయ్‌, మనవరాలు ఆరాధ్య కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story