విశాఖపై పోలీసు అధికారుల కమిటీ ఏర్పాటు
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో విశాఖ పరిపాలన రాజధానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. విశాఖలో భద్రత, పోలీసు శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల అధ్యయనం కోసం ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీకి విశాఖ పోలీస్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా ప్లానింగ్ ఓఎస్‌డీ ఉంటారు. కమిటీలో 8 మంది సభ్యులున్నారు. వీరిలో నలుగురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఓఎస్‌డీ ఉన్నారు. ఈ కమిటీలో ఇంటెలిజెన్స్ ఐజీ, ట్రైనింగ్ ఐజీ, […]

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో విశాఖ పరిపాలన రాజధానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. విశాఖలో భద్రత, పోలీసు శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల అధ్యయనం కోసం ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీకి విశాఖ పోలీస్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా ప్లానింగ్ ఓఎస్‌డీ ఉంటారు. కమిటీలో 8 మంది సభ్యులున్నారు. వీరిలో నలుగురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఓఎస్‌డీ ఉన్నారు.
ఈ కమిటీలో ఇంటెలిజెన్స్ ఐజీ, ట్రైనింగ్ ఐజీ, పర్సనల్ ఐజీ, పీ అండ్ ఎల్ ఐజీ, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీ, ప్లానింగ్ ఓఎస్‌డీ సభ్యులుగా ఉంటారు. పరిపాలన రాజధానిలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆ దిశగా డీజీపీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
రాజధానిలో ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలి ?… పరిపాలన రాజధానిలో ఇంకెంత మంది అదనపు పోలీసు సిబ్బంది అవసరం అవుతారు? వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. పోలీసు శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనా కమిటీ అధ్యయనం చేస్తుంది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ కమిటీని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.