Telugu Global
International

సెరో సర్వేలో ఆస్తికర విషయాలు... మురికి వాడల్లో 57 శాతం మందికి కరోనా

ముంబై మురికివాడల్లో మున్సిపల్ అధికారులు చేపట్టిన సెరో సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 7వేల మందిపై నిర్వహించిన సర్వేలో 57 శాతం మందికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే వీరందరికీ కరోనా వచ్చి తగ్గిపోయిందని, ఆ విషయం వాళ్లకు కూడా తెలియరాలేదని సర్వేలో తేలింది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని మూడు వార్డుల మురికి వాడలకు చెందిన 6,936 మంది నుంచి నమూనాలు సేకరించారు. వీరిలో 57 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనిపించాయి. […]

సెరో సర్వేలో ఆస్తికర విషయాలు... మురికి వాడల్లో 57 శాతం మందికి కరోనా
X

ముంబై మురికివాడల్లో మున్సిపల్ అధికారులు చేపట్టిన సెరో సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 7వేల మందిపై నిర్వహించిన సర్వేలో 57 శాతం మందికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే వీరందరికీ కరోనా వచ్చి తగ్గిపోయిందని, ఆ విషయం వాళ్లకు కూడా తెలియరాలేదని సర్వేలో తేలింది.

బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని మూడు వార్డుల మురికి వాడలకు చెందిన 6,936 మంది నుంచి నమూనాలు సేకరించారు. వీరిలో 57 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనిపించాయి. అంటే వారికి కోవిడ్-19 సోకి నయమైనట్లు అర్థం. మరోవైపు రెసిడెన్షియల్ సొసైటీలలో సర్వే చేయగా.. వారిలో 16 శాతం మందికి మాత్రమే వైరస్ సోకినట్టు తెలిసింది. ఈ సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 40 శాతం మంది కరోనా బారిన పడినట్లు స్పష్టమైంది.

అయితే కరోనా సోకినా సరే వీరిలో మరణాల రేటు తక్కువగా ఉందని.. అందుకు బస్తీల్లో యువకుల జనాభా ఎక్కువగా ఉండటమే కారణమని ఒక సర్వే అధికారి తెలిపారు. ఇందులో సుమారు ఏడు వేల మంది ఎటువంటి కరోనా టెస్టులు చేయించుకోలేదు. వారిలో లక్షణాలు వెల్లడికాకపోవడం వల్లే వైరస్ సోకినట్టు గుర్తించలేదని అధికారులు భావిస్తున్నారు.

సెరో సర్వేలో పాల్గొన్నవారి నుంచి రక్త నమూనాలు సేకరిస్తారు. దేహంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించినట్లయితే దానిని ఎదుర్కొనడానికి ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను ఈ నమూనాలను పరీక్షించి కనుక్కుంటారు. అంటే, ఇప్పటివరకు కరోనాబారిన పడ్డవారి సంఖ్యను, వైరస్ వ్యాప్తిని అంచనావేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది.

First Published:  28 July 2020 11:35 PM GMT
Next Story