Telugu Global
National

దాచుకున్న రూ. 4 లక్షలను పేదల ఆహారం కోసం...

సొంతిల్లు కొనుక్కోవాలనుకునేది ఆ జంట కల. ఒక చిన్నపాటి ప్రైవేట్ స్కూల్ నడిపిస్తూ వచ్చిన ఆదాయంలో నుంచి కొంత సొమ్మును సొంతిల్లు కొనుక్కోవడానికి దాచుకుంటున్నారు. కానీ, కరోనా లాడ్‌డౌన్ కారణంగా తమ విద్యార్థి కుటుంబాలు తినడానికి తిండి కూడా లేదని తెలిసి సొంతింటి కోసం దాచుకున్న సొమ్ములో రూ. 4 లక్షలు ఖర్చు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో అంబుజ్‌వాడీ ఒకటి. ఇక్కడే మిజ్గా షేక్, ఆమె భర్త ఫయాజ్‌లు జీల్ […]

దాచుకున్న రూ. 4 లక్షలను పేదల ఆహారం కోసం...
X

సొంతిల్లు కొనుక్కోవాలనుకునేది ఆ జంట కల. ఒక చిన్నపాటి ప్రైవేట్ స్కూల్ నడిపిస్తూ వచ్చిన ఆదాయంలో నుంచి కొంత సొమ్మును సొంతిల్లు కొనుక్కోవడానికి దాచుకుంటున్నారు. కానీ, కరోనా లాడ్‌డౌన్ కారణంగా తమ విద్యార్థి కుటుంబాలు తినడానికి తిండి కూడా లేదని తెలిసి సొంతింటి కోసం దాచుకున్న సొమ్ములో రూ. 4 లక్షలు ఖర్చు చేశారు. వివరాల్లోకి వెళితే..

ముంబైలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో అంబుజ్‌వాడీ ఒకటి. ఇక్కడే మిజ్గా షేక్, ఆమె భర్త ఫయాజ్‌లు జీల్ అనే స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు వచ్చే వాళ్లంతా పేదల పిల్లలే. తల్లిదండ్రులు రోజు వారీ కూలీ పనులకు వెళ్లగా, విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. అతి తక్కువ ఫీజుకే విద్యార్థులకు ఈ దంపతులు పాఠాలు బోధిస్తున్నారు.

అయితే లాక్‌డౌన్ సమయంలో తాము స్కూల్ ఫీజ్ చెల్లించలేమని ప్రిన్సిపల్ మీజ్గా షేక్‌కు తెలిపారు. దీంతో మూడు నెలల ఫీజును ఆమె చెల్లించవద్దని విద్యార్థులకు చెప్పారు. అంతే కాదు, విద్యార్థుల మాటల్లో వారు సరిగా భోజనం కూడా చేయడం లేదని తెలుసుకున్నారు. వెంటనే తన భర్త ఫయాజ్‌తో ఈ విషయం చెప్పారు. దీంతో వాళ్ల పర్సనల్ సేవింగ్స్‌లో నుంచి రూ. 4 లక్షల రూపాయలను వెచ్చించి 1500 మందికి నిత్యావసర సరుకులు కొనిచ్చారు.

మొదట్లో సరుకులను స్కూల్‌లో ఉన్న ఐదు గదుల్లో ఉంచే వాళ్లు. అయితే ఒక ఎన్జీవో వీరితో కలసి కిచిడీ తయారు చేసి అందరికీ పంచి పెట్టింది. ఎనిమిది వారాల తర్వాత ఎన్జీవో తిరిగి వెళ్లిపోవడంతో ఇక భార్యాభర్తలు ఇద్దరే సరుకుల పంపిణీని భుజానికి ఎత్తుకున్నారు. స్కూల్ చిన్నది కావడంతో భయాందర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సరుకులు తక్కువ ధరకు వస్తుండటంతో 10కేజీలు, 15 కేజీల కిట్లను తయారు చేశారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి అంబూజ్‌వాడీ ప్రాంతంలో పంపిణీ చేశారు.

ఇలా ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిసి జోగేశ్వరి, సియాన్ ప్రాంతాల నుంచి కూడా రేషన్ కోసం పేదలు వచ్చేవాళ్లు. అయినా సరే వారికి కూడా రేషన్ అందించారు. తాము ఎవరెవరికి సరుకులు అందించామో అందరి వివరాలు నమోదు చేసుకున్నారు. తమ 10, 13 ఏళ్ల పిల్లలను ఇంటి వద్దే వదలి ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ జంట చేసిన సహాయానికి అంబూజ్ వాడీలో ఎంతో మంతి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

First Published:  24 July 2020 8:30 PM GMT
Next Story