Telugu Global
National

గవర్నర్ కార్యాలయంతో పీఎంవో ఆరా అవాస్తవం?

మూడు రాజధానుల బిల్లుపై ప్రధాని కార్యాలయం … గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరిపిందంటూ టీడీపీ మీడియాలో వచ్చిన కథనాలుపై బీజేపీ సీనియర్ నేత పురిగళ్ల రఘురాం స్పందించారు. పీఎంవో ఆరా తీసినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాము ఢిల్లీలోనే ఉంటున్నామని… తమకు మాత్రం అలాంటి సమాచారం అందలేదని చెప్పారు. మీడియా సంస్థలు తమకు కావాల్సిన విధంగా వార్తలు రాసుకుంటున్నాయన్నారు. ఒకవేళ పీఎంవో లీక్ ఇచ్చి ఉంటే ఒక ప్రాంతీయ పత్రికకు మాత్రమే ఎందుకు ఇస్తుందని రఘురాం […]

గవర్నర్ కార్యాలయంతో పీఎంవో ఆరా అవాస్తవం?
X

మూడు రాజధానుల బిల్లుపై ప్రధాని కార్యాలయం … గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరిపిందంటూ టీడీపీ మీడియాలో వచ్చిన కథనాలుపై బీజేపీ సీనియర్ నేత పురిగళ్ల రఘురాం స్పందించారు. పీఎంవో ఆరా తీసినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాము ఢిల్లీలోనే ఉంటున్నామని… తమకు మాత్రం అలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

మీడియా సంస్థలు తమకు కావాల్సిన విధంగా వార్తలు రాసుకుంటున్నాయన్నారు. ఒకవేళ పీఎంవో లీక్ ఇచ్చి ఉంటే ఒక ప్రాంతీయ పత్రికకు మాత్రమే ఎందుకు ఇస్తుందని రఘురాం ప్రశ్నించారు.

ఎవరికి వారు అనుకూలంగా వార్తలు రాసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని పార్లమెంట్ వేదికగానే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని… తమ పార్టీ విధానం కూడా ఇది వరకే స్పష్టం చేశామని కూడా పురిగళ్ల రఘురాం స్పష్టం చేశారు.

మూడు రాజధానుల బిల్లు ప్రస్తుతం గవర్నర్‌ వద్దకు చేరిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది అంటూ గురువారం టీవీ మీడియా కథనాలు ప్రసారం చేశాయి.

అమరావతి జేఏసీ నేత జీవీఆర్ శాస్త్రి రాసిన లేఖకు స్పందించిన ప్రధాని కార్యాలయం… వెంటనే గవర్నర్‌ కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే ఒక టీడీపీ మీడియా సంస్థ మినహా మరే చోట ఈ ఊసు లేదు.

First Published:  23 July 2020 11:59 PM GMT
Next Story