Telugu Global
National

‘స్టే హోం " స్టే సేఫ్’... ఇల్లు సురక్షితమేనా?

బయటకు వెళుతున్నపుడు చెప్పులు వేసుకున్నంత సహజంగా మాస్క్ ని ధరిస్తున్న కరోనా కాలం ఇది. ఎందుకంటే బయట ఎవరు ఆరోగ్యవంతులో, ఎవరిలో వైరస్ ఉందో తెలియదు కనుక మాస్క్ తప్పనిసరి. అయితే మనకు తెలియని వారి ద్వారా కంటే ఇంట్లో వారి నుండే వైరస్ సోకే అవకాశాలు మరింత ఎక్కువ అని  దక్షిణ కొరియాకు చెందిన అంటువ్యాధుల వైద్య నిపుణులు అంటున్నారు.  బయటకు వెళ్లినప్పుడే కాదు ఇంట్లోనూ జాగ్రత్తగా ఉండండి…అని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ సెంటర్స్ ఫర్ […]

‘స్టే హోం  స్టే సేఫ్’... ఇల్లు సురక్షితమేనా?
X

బయటకు వెళుతున్నపుడు చెప్పులు వేసుకున్నంత సహజంగా మాస్క్ ని ధరిస్తున్న కరోనా కాలం ఇది. ఎందుకంటే బయట ఎవరు ఆరోగ్యవంతులో, ఎవరిలో వైరస్ ఉందో తెలియదు కనుక మాస్క్ తప్పనిసరి.

అయితే మనకు తెలియని వారి ద్వారా కంటే ఇంట్లో వారి నుండే వైరస్ సోకే అవకాశాలు మరింత ఎక్కువ అని దక్షిణ కొరియాకు చెందిన అంటువ్యాధుల వైద్య నిపుణులు అంటున్నారు. బయటకు వెళ్లినప్పుడే కాదు ఇంట్లోనూ జాగ్రత్తగా ఉండండి…అని వారు హెచ్చరిస్తున్నారు.

అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు ప్రచురించిన అధ్యయనంలో సైతం ఇవే విషయాలు ఉన్నాయి. 5,706మంది వైరస్ సోకినవారిని… వారితో ఏదో విధంగా సన్నిహితంగా మెలిగిన 59,000మందిని ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. పదిమందిలో ఒకరు తమ సొంత కుటుంబ సభ్యుల ద్వారా కరోనా బారిన పడుతున్నట్టుగా … ఈ అధ్యయనం చెబుతోంది.

కుటుంబంలో కరోనా బారిన పడినవారు టీనేజిలో లేదా 60నుండి70 మధ్య వయసులో ఉన్నవారయితే ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నవారందరూ ఇంట్లో ఉన్నపుడు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవటం వలన కుటుంబ సభ్యుల మధ్యే దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.

తక్కువ ప్రదేశంలో అంటే ఇరుకుగా ఉన్న గదుల్లో, ఇళ్లలో ఇన్ ఫెక్షన్లు మరింత తీవ్రంగా వ్యాపిస్తాయని చైనాలో నిర్వహించిన అధ్యయనం ఒకటి చెబుతోంది. విశాలమైన ప్రదేశాల్లో కంటే తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడినప్పుడే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కరోనా ఉధృతి తగ్గే వరకు ఇంట్లో అయినా, బయట అయినా సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని దీనిని బట్టి తెలుస్తోంది.

ఇళ్లు, హాస్పటల్స్, జైళ్లు, ఆఫీసులు… వంటివన్నీ కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు కాగా పార్కులు, విశాలమైన ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ఒక బిల్డింగులో ఉండాల్సి వస్తే తప్పకుండా అక్కడ గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దక్షిణ కొరియాలో ఒక ఆఫీస్ లోని ఒక అంతస్తులో పనిచేస్తున్నవారిలో సగంమందికి పైగా సిబ్బంది ఒకేసారి కరోనా బారిన పడ్డారు. అందుకే ‘స్టే హోం… స్టే సేఫ్’ ని కాస్త మార్పు చేసుకోవాలి. ఇంట్లో ఉన్నంత మాత్రాన సురక్షితంగా ఉన్నట్టు కాదని, కుటుంబ సభ్యులు సైతం సామాజిక దూరం పాటించడం, ఇంట్లో గాలి వెలుతురు సవ్యంగా ఉండేలా చూసుకోవటం లాంటి జాగ్రత్తలు సైతం తప్పనిసరిగా పాటించాలని గుర్తుంచుకోవాలి.

First Published:  22 July 2020 9:19 PM GMT
Next Story