Telugu Global
Cinema & Entertainment

పవర్ స్టార్ ను లైట్ తీసుకున్న మెగా ఫ్యామిలీ

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వొద్దు. పవర్ స్టార్ అనే సినిమాను మెగా ఫ్యామిలీ లైట్ తీసుకుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ రిలీజై 24 గంటలైనా మెగా కంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు.. కాంపౌండ్ తో టచ్ లో ఉండే పెద్ద పెద్ద ఫ్యాన్ గ్రూప్స్ కూడా ఈ ట్రయిలర్ ను చూసీ చూడనట్టు వదిలేశాయి. పవర్ స్టార్ ట్రయిలర్ లో మెగా ఫ్యామిలీని టచ్ చేశాడు […]

పవర్ స్టార్ ను లైట్ తీసుకున్న మెగా ఫ్యామిలీ
X

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వొద్దు. పవర్ స్టార్ అనే సినిమాను మెగా ఫ్యామిలీ లైట్ తీసుకుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ రిలీజై 24 గంటలైనా మెగా కంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు.. కాంపౌండ్ తో టచ్ లో ఉండే పెద్ద పెద్ద ఫ్యాన్ గ్రూప్స్ కూడా ఈ ట్రయిలర్ ను చూసీ చూడనట్టు వదిలేశాయి.

పవర్ స్టార్ ట్రయిలర్ లో మెగా ఫ్యామిలీని టచ్ చేశాడు వర్మ. పవన్ కల్యాణ్ పాత్రధారిని ప్రవన్ కల్యాణ్ అని చూపిస్తూనే.. చిరంజీవి, నాగబాబు, త్రివిక్రమ్, చంద్రబాబు లాంటి పాత్రల్ని పరిచయం చేశాడు. రాజకీయాలతో ఆగకుండా పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సన్నివేశాల్ని కూడా చూపించాడు.

లెక్కప్రకారం ఈ ట్రయిలర్ పై ఈపాటికి నాగబాబు ఫైర్ అవ్వాలి. వర్మను బండబూతులు తిట్టాలి. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాలి. చిరంజీవి లేదా చరణ్ ట్విట్టర్ లో స్పందించాలి. కానీ అంతా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం చాలా సింపుల్.

వర్మ తీసిన సినిమాపై రియాక్ట్ అయి, అతడి సినిమాకు మరింత పబ్లిసిటీ ఇచ్చేకంటే మౌనంగా ఉండడమే మంచిదని మెగా కుటుంబం భావిస్తోంది. పైగా ఇది థియేటర్లలో రిలీజయ్యే సినిమా కూడా కాదు. అందుకే అందరూ ఇలా వ్యూహాత్మకంగా మౌనం వహించారు.

First Published:  23 July 2020 7:00 AM GMT
Next Story