Telugu Global
Cinema & Entertainment

ఈ టైమ్ లో రకుల్ ఎందుకొచ్చిందబ్బా!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల షూటింగ్స్ జరగడం లేదు. చిన్న చిన్న సినిమాలు మాత్రమే షూటింగ్స్ చేస్తున్నారు. అది కూడా ప్యాచ్ వర్క్ పనులు, ఓటీటీకి ఇవ్వాలనే ఆత్రుతలో ఉన్న సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వచ్చాయి. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ లో ల్యాండ్ అయింది రకుల్. అవును.. రకుల్ నిన్న హైదరాబాద్ లో దిగింది. ఇప్పటికిప్పుడు ఆమె చేయాల్సిన సినిమాలేం లేవు. నితిన్ తో ఓ సినిమా ఉంది. కానీ ప్రస్తుతం నితిన్ […]

ఈ టైమ్ లో రకుల్ ఎందుకొచ్చిందబ్బా!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల షూటింగ్స్ జరగడం లేదు. చిన్న చిన్న సినిమాలు మాత్రమే షూటింగ్స్ చేస్తున్నారు. అది కూడా ప్యాచ్ వర్క్ పనులు, ఓటీటీకి ఇవ్వాలనే ఆత్రుతలో ఉన్న సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వచ్చాయి. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ లో ల్యాండ్ అయింది రకుల్.

అవును.. రకుల్ నిన్న హైదరాబాద్ లో దిగింది. ఇప్పటికిప్పుడు ఆమె చేయాల్సిన సినిమాలేం లేవు. నితిన్ తో ఓ సినిమా ఉంది. కానీ ప్రస్తుతం నితిన్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. మరి ఎందుకామె ఉన్నఫలంగా హైదరాబాద్ వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.

ఈమధ్య రకుల్ పై ఓ ప్రచారం బాగా జరిగింది. ఆమె సినిమా షూటింగ్స్ కు సహకరించడం లేదని, ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వచ్చేందుకు తనకు ఇంట్రెస్ట్ లేదని మేకర్స్ కు చెబుతోందంటూ పుకార్లు వచ్చాయి. వీటిని అప్పట్లో ఖండించింది రకుల్. ఇప్పుడు చేతలతో చేసి చూపిస్తోంది. తను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఎప్పుడు షూటింగ్ కు పిలిస్తే అప్పుడు వస్తాననే నమ్మకం కలిగించేందుకు రకుల్ ఇలా సిటీకి వచ్చిందన్నమాట.

First Published:  23 July 2020 4:00 AM GMT
Next Story