Telugu Global
NEWS

మంత్రులకు శాఖల కేటాయింపు... శంకర్‌ నారాయణకు ఆర్‌ అండ్ బీ

కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సిదిరి అప్పలరాజుకు మత్స్యకార, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఇప్పటి వరకు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న శంకర్‌నారాయణకు ఆర్‌ అండ్‌ బీ శాఖ కేటాయించారు. ధర్మాన కృష్ణదాసుకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలను ధర్మాన కృష్ణదాసుకు అప్పగించారు. మంత్రులుగా సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉదయమే మంత్రులుగా ప్రమాణస్వీకారం […]

మంత్రులకు శాఖల కేటాయింపు... శంకర్‌ నారాయణకు ఆర్‌ అండ్ బీ
X

కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సిదిరి అప్పలరాజుకు మత్స్యకార, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఇప్పటి వరకు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న శంకర్‌నారాయణకు ఆర్‌ అండ్‌ బీ శాఖ కేటాయించారు.

ధర్మాన కృష్ణదాసుకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలను ధర్మాన కృష్ణదాసుకు అప్పగించారు.

మంత్రులుగా సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉదయమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

First Published:  22 July 2020 9:30 AM GMT
Next Story