Telugu Global
NEWS

ఆక్స్‌ఫర్డ్ టీకా విజయవంతం... త్వరలోనే మార్కెట్‌లో

కరోనా పేరు వింటేనే ప్రతీ ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ ఏ వైపు నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ముప్పు అలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్న వేళ ఆక్స్‌ఫర్డ్ చల్లని కబురు చెప్పింది. ఆస్ట్రాజెనకా ఫార్మాతో కలసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కున్నట్లు లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 140 […]

ఆక్స్‌ఫర్డ్ టీకా విజయవంతం... త్వరలోనే మార్కెట్‌లో
X

కరోనా పేరు వింటేనే ప్రతీ ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ ఏ వైపు నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ముప్పు అలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్న వేళ ఆక్స్‌ఫర్డ్ చల్లని కబురు చెప్పింది.

ఆస్ట్రాజెనకా ఫార్మాతో కలసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కున్నట్లు లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 140 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో ఒక ఆరు వ్యాక్సిన్లపైనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టిపెట్టింది.

అయితే డబ్ల్యూహెచ్‌వో ముందు నుంచి అంచనా వేసినట్లుగానే అందరికీ ఆక్స్‌ఫర్డ్ ఆశాదీపం అయ్యింది. ఈ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేస్తున్న వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం అయినట్లు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ పేర్కొన్నది.

సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే దాదాపు ఐదేళ్ల సమయం పడుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి బారి నుంచి మానవాళిని రక్షించాలనే కృత నిశ్చయంతో పరిశోధనలు భారీ ఎత్తున, సరికొత్త టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్లను ఉనయోగిస్తుండటంతో పరిశోధనా సమయం తగ్గిపోయింది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్‌లో ఉన్నాయి.

అయితే ఆక్స్‌ఫర్డ్ నిర్వహించిన హ్యూమన్ ట్రయల్ విజయవంతం అయినట్లు లాన్సెట్ తెలిపింది. వాళ్లు అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ అద్భుత ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ల శరీరాల్లో యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని కూడా సంపాదించాయని లాన్సెట్ పేర్కొంది.

ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన తర్వాత స్వల్పంగా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు తప్ప ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని తెలుస్తున్నది. కాగా, ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎంత కాలం కరోనాపై యుద్దం చేయగలుగుతున్నదనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

First Published:  20 July 2020 10:26 PM GMT
Next Story