Telugu Global
Cinema & Entertainment

వర్మను ఫాలో అవుతున్న షకీలా

అడల్ట్ సినిమాలకు సెన్సార్ అవ్వకపోతే నిర్మాతలు ఒకప్పుడు కిందామీదా పడేవాళ్లు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి రివ్యూ కమిటీకి సినిమా చూపించి, పైరవీలు చేసుకొని సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. తమ సినిమాను కావాలనే సెన్సార్ చేయించడం మానేశారు సినిమా జనాలు. పచ్చి బూతు సినిమా తీయడం, నేరుగా వెబ్ లో రిలీజ్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దీనికి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ. జీఎస్టీ సినిమా నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ […]

వర్మను ఫాలో అవుతున్న షకీలా
X

అడల్ట్ సినిమాలకు సెన్సార్ అవ్వకపోతే నిర్మాతలు ఒకప్పుడు కిందామీదా పడేవాళ్లు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి రివ్యూ కమిటీకి సినిమా చూపించి, పైరవీలు చేసుకొని సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. తమ సినిమాను కావాలనే సెన్సార్ చేయించడం మానేశారు సినిమా జనాలు. పచ్చి బూతు సినిమా తీయడం, నేరుగా వెబ్ లో రిలీజ్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.

దీనికి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ. జీఎస్టీ సినిమా నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఆర్జీవీ, లేటెస్ట్ గా తన సినిమాల్ని వరుసగా ఇదే టైపులో నెట్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడీ ట్రెండ్ ను షకీలా కూడా ఫాలో అవుతోంది.

‘లేడీస్ నాట్ ఎలౌడ్ అనే సినిమా తీసింది షకీలా. ఇదొక పచ్చి బూతు సినిమా. ట్రయిలర్ చూస్తేనే కంటెంట్ ఏంటనేది అర్థమైపోతుంది. ఈ ‘సినిమాకు ఎట్టిపరిస్థితుల్లో సెన్సార్ రాదనే విషయాన్ని ట్రయిలర్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇప్పుడీ సినిమాను నెట్ లో పెట్టేయాలని నిర్ణయించింది షకీలా.

‘లేడీస్ నాట్ ఎలౌడ్’ అనే వెబ్ సైట్ క్రియేట్ చేసి, అందులోనే ఈ సినిమాను పెట్టబోతోంది. టిక్కెట్ ధరను 50 రూపాయలుగా ఫిక్స్ చేసింది. తన సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ సినిమా తీశానని, దయచేసి మగాళ్లంతా ఈ సినిమాను ఆదరించాలని సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోంది షకీలా.

First Published:  19 July 2020 2:30 AM GMT
Next Story