Telugu Global
Cinema & Entertainment

కరోనాతో రేటు తగ్గించిన హీరోయిన్లు

కరోనా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకునే పరిస్థితి రావొచ్చంటూ విశ్లేషణలు వచ్చాయి. వాటికి తగ్గట్టే హీరోయిన్లు తమ రేట్లు తగ్గించుకుంటున్నారు. కాజల్ దాదాపు 25శాతం డిస్కౌంట్ ఇవ్వగా… అవకాశాల్లేని రకుల్ ఏకంగా 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. తన ప్రతి సినిమాకు కనీసం 2 కోట్ల రూపాయలు తీసుకుంటుంది కాజల్. ఆమె డిమాండ్ అలాంటిది. కానీ ఇప్పుడామె సినిమాకు కోటిన్నర మాత్రమే తీసుకుంటోంది. ఆచార్య సినిమాకు ఆమె తీసుకోబోయే […]

కరోనాతో రేటు తగ్గించిన హీరోయిన్లు
X

కరోనా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకునే పరిస్థితి రావొచ్చంటూ విశ్లేషణలు వచ్చాయి. వాటికి తగ్గట్టే హీరోయిన్లు తమ రేట్లు తగ్గించుకుంటున్నారు. కాజల్ దాదాపు 25శాతం డిస్కౌంట్ ఇవ్వగా… అవకాశాల్లేని రకుల్ ఏకంగా 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

తన ప్రతి సినిమాకు కనీసం 2 కోట్ల రూపాయలు తీసుకుంటుంది కాజల్. ఆమె డిమాండ్ అలాంటిది. కానీ ఇప్పుడామె సినిమాకు కోటిన్నర మాత్రమే తీసుకుంటోంది. ఆచార్య సినిమాకు ఆమె తీసుకోబోయే మొత్తం కోటిన్నర మాత్రమే. అంతేకాదు, తక్కువ కాల్షీట్లలో సినిమాను పూర్తిచేస్తే.. మరో 25లక్షలు తగ్గించుకోవడానికి కూడా రెడీ అని యూనిట్ కు చెప్పేసింది.

ఇటు రకుల్ అయితే బాగా తగ్గింది. ఒకప్పుడు సినిమాకు కోటిన్నర నుంచి కోటి 75 లక్షల రూపాయల వరకు తీసుకునేది రకుల్. కానీ ఇప్పుడు 80 లక్షలకే సినిమా చేసేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో నితిన్ తో చేస్తున్న ఛెక్ మూవీ మాత్రమే ఉంది.

ఇలా కరోనా వల్ల రకుల్, కాజల్ లాంటి హీరోయిన్లు అందుబాటులోకి వచ్చారు. హీరోలు కూడా ఇలానే రేటు తగ్గిస్తే నిర్మాతలపై మరింత భారం తగ్గుతుంది. కానీ తెలుగు నుంచి ఇప్పటివరకు పెద్ద హీరోలెవ్వరూ తమ రేట్లు తగ్గించుకోలేదు. అదే బాధాకరం.

First Published:  18 July 2020 9:46 PM GMT
Next Story