Telugu Global
Cinema & Entertainment

పాన్-ఇండియా కాంబినేషన్ అదిరింది

పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నప్పుడు నటీనటుల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అంతా భారీగానే ఉండాలి. ఏ ఎలిమెంట్ లో నూ వెనక్కి తగ్గకూడదు. ఏ చిన్న లోపం కనిపించినా దాన్ని పాన్-ఇండియన్ మూవీగా ప్రేక్షకులు గుర్తించరు. అందుకే ప్రభాస్ సినిమా కోసం అదిరిపోయే హీరోయిన్ ను రంగంలోకి దించారు. అవును.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక పదుకోన్ సెట్ అయింది. నిజంగా ఇది పాన్-ఇండియా కాంబినేషన్. దీపిక పదుకోన్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ […]

పాన్-ఇండియా కాంబినేషన్ అదిరింది
X

పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నప్పుడు నటీనటుల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అంతా భారీగానే ఉండాలి. ఏ ఎలిమెంట్ లో నూ వెనక్కి తగ్గకూడదు. ఏ చిన్న లోపం కనిపించినా దాన్ని పాన్-ఇండియన్ మూవీగా ప్రేక్షకులు గుర్తించరు. అందుకే ప్రభాస్ సినిమా కోసం అదిరిపోయే హీరోయిన్ ను రంగంలోకి దించారు.

అవును.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక పదుకోన్ సెట్ అయింది. నిజంగా ఇది పాన్-ఇండియా కాంబినేషన్. దీపిక పదుకోన్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రభాస్ ఆల్రెడీ పాన్ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. సో.. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నాగ అశ్విన్ తీయబోయే పాన్-వరల్డ్ సినిమాలో నటించబోతున్నారు.

తమ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకోన్ ను తీసుకున్నామనే విషయాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

First Published:  19 July 2020 10:00 AM GMT
Next Story