Telugu Global
Cinema & Entertainment

సింగర్ స్మిత అకౌంట్ లో నీలిచిత్రాలు

అవును.. మీరు చదివింది నిజమే. సింగర్ స్మిత ఫేస్ బుక్ పేజీలో ఒక్కసారిగా నీలిచిత్రాలు, అశ్లీల ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో జనాలతో పాటు స్మిత కూడా అవాక్కయింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఆమె ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. అక్కడితో ఆగకుండా ఎకౌంట్ లో అశ్లీల చిత్రాలు పెట్టారు. తన ఎకౌంట్ కంట్రోల్ లో లేకపోవడంతో వెంటనే ఫేస్ బుక్ టీమ్ ను ఆశ్రయించింది స్మిత. వాళ్లు 15 గంటల పాటు శ్రమించి, పాత […]

సింగర్ స్మిత అకౌంట్ లో నీలిచిత్రాలు
X

అవును.. మీరు చదివింది నిజమే. సింగర్ స్మిత ఫేస్ బుక్ పేజీలో ఒక్కసారిగా నీలిచిత్రాలు, అశ్లీల ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో జనాలతో పాటు స్మిత కూడా అవాక్కయింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఆమె ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. అక్కడితో ఆగకుండా ఎకౌంట్ లో అశ్లీల చిత్రాలు పెట్టారు.

తన ఎకౌంట్ కంట్రోల్ లో లేకపోవడంతో వెంటనే ఫేస్ బుక్ టీమ్ ను ఆశ్రయించింది స్మిత. వాళ్లు 15 గంటల పాటు శ్రమించి, పాత డేటా డిలీట్ అవ్వకుండా స్మిత ఎకౌంట్ ను పునరుద్ధరించగలిగారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

తన ఎకౌంట్ హ్యాక్ కు గురైందని, తన టీమ్ తో పాటు ఫేస్ బుక్ సిబ్బంది తిరిగి పునరుద్ధరించారని చెప్పుకొచ్చింది. ఓ బ్యాడ్ డే గడిచిపోయిందని, అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ పోస్టు పెట్టింది స్మిత.

Had one hell of a mad day. My FB page got hacked and someone started posting stupid content. It’s back now. Thanks to…

Publiée par Smita sur Vendredi 17 juillet 2020

First Published:  18 July 2020 10:12 AM GMT
Next Story