Telugu Global
International

పక్షులకు చేతులు ఉంటే...!

‘అబ్బా… నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండేది ’ అని చాలామంది  చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులను చూసినప్పుడు తప్పకుండా అలా అనిపిస్తుంది. అయితే… పక్షులకు మనలాగా చేతులు ఉంటే బాగుండు అనే ఆలోచన మాత్రం చాలా అరుదే. ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన వచ్చింది. అతని పేరు డంకన్ ఇవాన్స్. బ్రిటీష్ వీడియో కంటెంట్ క్రియేటర్ ఇతను. డంకన్ ఇవాన్స్ తన ఫొటోషాప్ నైపుణ్యంతో వివిధ పక్షులకు చేతులను […]

పక్షులకు చేతులు ఉంటే...!
X

‘అబ్బా… నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండేది ’ అని చాలామంది చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులను చూసినప్పుడు తప్పకుండా అలా అనిపిస్తుంది.

అయితే… పక్షులకు మనలాగా చేతులు ఉంటే బాగుండు అనే ఆలోచన మాత్రం చాలా అరుదే. ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన వచ్చింది. అతని పేరు డంకన్ ఇవాన్స్. బ్రిటీష్ వీడియో కంటెంట్ క్రియేటర్ ఇతను.

డంకన్ ఇవాన్స్ తన ఫొటోషాప్ నైపుణ్యంతో వివిధ పక్షులకు చేతులను జోడించి… అవి వివిధ పనులు చేస్తున్నట్టుగా వీడియో రూపొందించాడు. దీనికి ‘మిస్టర్ బ్లూ స్కై’ అనే పాపులర్ పాట తాలూకూ సంగీతాన్ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా సమకూర్చాడు. ఈ పాటకి చాలా హ్యాపీయస్ట్ సాంగ్ గా గుర్తింపు ఉంది. ఇక ఈ మ్యూజిక్ తో చేతులున్న పక్షులు చేసే విన్యాసాలు చూసేవారిని అబ్బురపరచేలా ఉన్నాయి.

చేతులు పైకి ఊపుతూ పరిగెత్తడం, పుస్తకాన్ని చేతులతో పట్టుకుని చదువుకోవటం, వెయిట్స్ తో వ్యాయామం చేయటం, గొడుగు వేసుకుని బ్రీఫ్ కేస్ ని లాక్కుంటూ వెళ్లటం, సెల్ఫీ స్టాండ్ తో సెల్ఫీ తీసుకోవటం, గిటార్ వాయించడం, బట్టలు ఉతుక్కోవటం…. ఇలాంటి పనులను చేతులతో చేస్తున్న రకరకాల పక్షులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేలా ఉన్నాయి. ఈ వీడియోని షేర్ చేయగానే సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు వ్యూస్ వెల్లువెత్తాయి.

పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే ఫేస్ బుక్ లో కోటి డెభ్బై లక్షల వ్యూస్ ని, ట్విట్టర్ లో అరవై లక్షల వీక్షణలను సాధించింది ఇది. ముప్పయి సెకన్లకంటే తక్కువ నిడివితో ఉన్న ఈ వీడియో… చేతులున్న పక్షుల విన్యాసాలే కాదు….పక్షులకు చేతులను ఊహించిన మనిషి సృజనాత్మక శక్తిని సైతం మన కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.

View this post on Instagram

If birds had arms… __ Comment your favourite bird ??

A post shared by Duncan Evans (@curlykidlife) on

Next Story