Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బన్నీకి ఇలాంటి ఫీట్స్ కొత్తకాదు. అప్పటివరకు ఎంతోమంది హీరోల పేర్లు వినిపిస్తాయి. సడెన్ గా బన్నీ పేరు తెరపైకొస్తుంది. ఆ వెంటనే ప్రాజెక్టును కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ఎఁదుకో బన్నీకే ఇలా జరుగుతుంటాయి. ఉదాహరణకు సన్నాఫ్ సత్యమూర్తి సినిమానే తీసుకుందాం. త్రివిక్రమ్ తో ఆ ప్రాజెక్టు కోసం చాలా పేర్లు తెరపైకొచ్చాయి. ఆఖరి నిమిషంలో బన్నీ ఎంటరవ్వడం, సినిమాను ప్రకటించడం, ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అంతెందుకు.. ప్రస్తుతం చేతిలో ఉన్న పుష్ప […]

అల్లు అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
X

బన్నీకి ఇలాంటి ఫీట్స్ కొత్తకాదు. అప్పటివరకు ఎంతోమంది హీరోల పేర్లు వినిపిస్తాయి. సడెన్ గా బన్నీ పేరు తెరపైకొస్తుంది. ఆ వెంటనే ప్రాజెక్టును కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ఎఁదుకో బన్నీకే ఇలా జరుగుతుంటాయి.

ఉదాహరణకు సన్నాఫ్ సత్యమూర్తి సినిమానే తీసుకుందాం. త్రివిక్రమ్ తో ఆ ప్రాజెక్టు కోసం చాలా పేర్లు తెరపైకొచ్చాయి. ఆఖరి నిమిషంలో బన్నీ ఎంటరవ్వడం, సినిమాను ప్రకటించడం, ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.

అంతెందుకు.. ప్రస్తుతం చేతిలో ఉన్న పుష్ప ప్రాజెక్టు కూడా బన్నీ చేయాల్సిన సినిమా కాదు. ఈ సినిమా మొన్నటివరకు మహేష్ బాబు చుట్టూ తిరిగింది. సడెన్ గా ఓ రోజు బన్నీతో ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఆ వెంటనే సినిమా లాంఛ్ అయింది కూడా.

ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. ఇలాంటిదే మరో సడెన్ ప్రాజెక్టును బన్నీ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈసారి దర్శకుడు కొరటాల శివ.

అవును.. ఆచార్య సినిమా తర్వాత లెక్కప్రకారం ఎన్టీఆర్ తో సినిమా చేయాలి కొరటాల. ఒకవేళ తారక్ బిజీగా ఉంటే రామ్ చరణ్ తో సినిమా చేయాలి. కానీ ఇప్పుడు వీళ్లిద్దర్నీ కాదని బన్నీ పేరు తెరపైకొచ్చింది. అల్లు అర్జున్ పేరు వినిపించిందంటే సినిమా దాదాపు సెట్ అయినట్టే. అతడి ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా.

First Published:  18 July 2020 12:17 AM GMT
Next Story