Telugu Global
Cinema & Entertainment

ఆచార్యలో మరో హీరోయిన్...

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ ప్రాజెక్టులో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ తో లెక్క ఆగిపోలేదు. ఆచార్యలోకి అలా అలా హీరోయిన్లు వచ్చి చేరుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య 4కు చేరింది.. వాళ్లెవరో వరుసగా చూద్దాం. ముందుగా కాజల్.. ఈమె ఆచార్యలో మెయిన్ హీరోయిన్. ఈమె తర్వాత సినిమా కోసం మరో హీరయిన్ గా రెజీనాను తీసుకున్నారు. […]

ఆచార్యలో మరో హీరోయిన్...
X

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ ప్రాజెక్టులో కాజల్
ను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ తో లెక్క ఆగిపోలేదు.
ఆచార్యలోకి అలా అలా హీరోయిన్లు వచ్చి చేరుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల
సంఖ్య 4కు చేరింది.. వాళ్లెవరో వరుసగా చూద్దాం.

ముందుగా కాజల్.. ఈమె ఆచార్యలో మెయిన్ హీరోయిన్. ఈమె తర్వాత సినిమా కోసం మరో
హీరయిన్ గా రెజీనాను తీసుకున్నారు. ఈమెను ఐటెంసాంగ్ కోసం తీసుకున్నారు. ఆ సాంగ్
పిక్చరైజేషన్ కూడా పూర్తయింది.

ఇక ఆచార్యలో మూడో హీరోయిన్ పేరు తమన్న. ఈమె తాజాగా లిస్ట్ లోకి చేరింది. సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ఈమెను తీసుకున్నారట. ఈమె కూడా చిరంజీవి సరసనే కనిపించబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తమన్న వస్తుందట.

ఇక ఈ సినిమాలో నాలుగో హీరోయిన్ గా కీర్తిసురేష్ పేరు వినిపిస్తోంది. సినిమాలో స్పెషల్ లెంగ్తీ రోల్ చేస్తున్న రామ్ చరణ్ సరసన కీర్తిసురేష్ నటించనుంది. ఇలా ఆచార్యలో హీరోయిన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.

First Published:  17 July 2020 10:30 PM GMT
Next Story