Telugu Global
Cinema & Entertainment

తెలుగుతెరపై డిఫరెంట్ జోడీ... తమన్న అందుకే ఒప్పుకుందట...

కొన్ని కాంబినేషన్లను అస్సలు ఊహించరు ప్రేక్షకులు. ఇలాంటి జోడీలు కూడా సెట్ అవుతాయా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. సరిగ్గా అలాంటి ఆన్ స్క్రీన్ జోడీనే ఒకటి సెట్ అయింది. సత్యదేవ్, తమన్న కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ కాంబినేషనే వెరైటీగా ఉంది కదా. అవును.. అదే ఈ ప్రాజెక్టుకు బలం అంటున్నారు మేకర్స్. కన్నడలో హిట్టయిన లవ్ మాక్ టైల్ అనే సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులోకి హీరోగా సత్యదేవ్ ను, […]

తెలుగుతెరపై డిఫరెంట్ జోడీ... తమన్న అందుకే ఒప్పుకుందట...
X

కొన్ని కాంబినేషన్లను అస్సలు ఊహించరు ప్రేక్షకులు. ఇలాంటి జోడీలు కూడా సెట్ అవుతాయా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. సరిగ్గా అలాంటి ఆన్ స్క్రీన్ జోడీనే ఒకటి సెట్ అయింది. సత్యదేవ్, తమన్న కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

ఈ కాంబినేషనే వెరైటీగా ఉంది కదా. అవును.. అదే ఈ ప్రాజెక్టుకు బలం అంటున్నారు మేకర్స్. కన్నడలో హిట్టయిన లవ్ మాక్ టైల్ అనే సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులోకి హీరోగా సత్యదేవ్ ను, హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారు.

మూవీలో హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంది. అందుకే సత్యదేవ్ సరసన నటించడానికి ఒప్పుకుంది తమన్న.

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్-1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి కీరవాణి వారసుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story