Telugu Global
NEWS

పోలీసులు ఇలాగే ఉంటే... నాపై మళ్లీ దాడి జరగొచ్చు " ఏవీ సుబ్బారెడ్డి

టీడీపీ నేత ఏపీ సుబ్బారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తన కుమార్తెతో పాటు వెళ్లి ఎస్పీని కలిసిన సుబ్బారెడ్డి… భూమా అఖిలప్రియను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం అఖిలప్రియను అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరారు. కేసులో ఏ 1నుంచి ఏ6 వరకు అరెస్ట్ చేశారని.. కానీ ఏ4గా ఉన్న అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సుబ్బారెడ్డి మీడియా వద్ద ప్రశ్నించారు. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఏదైనా […]

పోలీసులు ఇలాగే ఉంటే... నాపై మళ్లీ దాడి జరగొచ్చు  ఏవీ సుబ్బారెడ్డి
X

టీడీపీ నేత ఏపీ సుబ్బారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తన కుమార్తెతో పాటు వెళ్లి ఎస్పీని కలిసిన సుబ్బారెడ్డి… భూమా అఖిలప్రియను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం అఖిలప్రియను అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరారు.

కేసులో ఏ 1నుంచి ఏ6 వరకు అరెస్ట్ చేశారని.. కానీ ఏ4గా ఉన్న అఖిలప్రియను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సుబ్బారెడ్డి మీడియా వద్ద ప్రశ్నించారు. భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఏదైనా మతలబు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

తనను హత్య చేసేందుకు భూమా అఖిలప్రియ దంపతులు సుఫారీ ఇచ్చింది నిజం కాదా అని పోలీసులను ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో అఖిల ప్రియ దంపతులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే… మరోసారి వారు తనపై దాడి చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్‌ వస్తే ఈ కేసులో పోలీసులను కూడా అఖిలప్రియ లెక్క చేసే పరిస్థితి ఉండదన్నారు. కాబట్టి తక్షణం అరెస్ట్ చేయాల్సిందిగా ఎస్పీని కోరినట్టు సుబ్బారెడ్డి వివరించారు.

భూమా అఖిలప్రియ మహిళ ముసుగు వేసుకుని హత్యారాజకీయాలు చేస్తోందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి విమర్శించారు. అఖిలప్రియ దంపతులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో తన తండ్రిని ఎదుర్కోలేక, అడ్డుతొలగించేందుకు అఖిలప్రియ కుట్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఏవీ సుబ్బారెడ్డి అనుమానాలపై స్పందించిన జిల్లా ఎస్పీ ఈ కేసులో చట్టబద్దంగానే తాము ముందు కెళ్తున్నామని వివరించారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ AV సుబ్బారెడ్డి గారు మరియు వారి కుమార్తె AV జస్వంతి…

Publiée par A.V. Subba Reddy sur Jeudi 16 juillet 2020

First Published:  16 July 2020 5:52 AM GMT
Next Story