Telugu Global
International

రష్యా వ్యాక్సిన్‌పై తప్పుడు వార్తలు

“అశ్వద్ధామ హతః కుంజరః” ఈ మాట గురించి అందరికి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌పై కూడా మన మీడియా ఇలాగే వ్యవహరిస్తోంది. మొన్న నైజీరియా వ్యాక్సిన్‌ రెడీ అయిపోయిందని… ఆ తర్వాత భారత్‌ బయోటెక్ కంపెనీ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిందని రాసింది. ఇప్పుడు రష్యా వ్యాక్సిన్‌ రెడీ అంటూ ప్రచారం ఊదరగొట్టింది. రష్యా వ్యాక్సిన్‌ ఫేజ్‌ 1 క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే అయిపోయాయి. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 ఉన్నాయి. హెల్తీ వాలంటీర్స్ మీద మాత్రమే క్లినికల్‌ […]

రష్యా వ్యాక్సిన్‌పై తప్పుడు వార్తలు
X

“అశ్వద్ధామ హతః కుంజరః” ఈ మాట గురించి అందరికి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌పై కూడా మన మీడియా ఇలాగే వ్యవహరిస్తోంది. మొన్న నైజీరియా వ్యాక్సిన్‌ రెడీ అయిపోయిందని… ఆ తర్వాత భారత్‌ బయోటెక్ కంపెనీ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిందని రాసింది. ఇప్పుడు రష్యా వ్యాక్సిన్‌ రెడీ అంటూ ప్రచారం ఊదరగొట్టింది.

రష్యా వ్యాక్సిన్‌ ఫేజ్‌ 1 క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే అయిపోయాయి. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 ఉన్నాయి. హెల్తీ వాలంటీర్స్ మీద మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ అయిపోయాయని రష్యా సైంటిస్టు చెప్పాడు. కానీ మన మీడియా మాత్రం క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి అయినట్లు రాశాయి.

“ప్రపంచం లో మొదటి కరోనా వ్యాక్సిన్ రెడీ”, “క్లినికల్ ట్రయిల్స్ పూర్తి చేసిన రష్యా”, “బ్రేక్ త్రూ వచ్చేసింది”, “ఇంకా ఊపిరి పీల్చుకోవచ్చు” వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ హెడ్డింగ్స్‌ పెట్టి ఊదరగొట్టాయి. పూర్తిగా క్లినికల్ ట్రయిల్స్ అయ్యాయి అన్నట్లు వార్తలు రాశాయి.

అమెరికా నుంచి వచ్చే న్యూయార్క్ టైమ్స్‌, అరబ్బు ప్రపంచం నుంచి వచ్చే అల్ జజీరా, ఇంగ్లాండ్ నుంచి వచ్చే ది గార్డీయన్‌, చైనా నుంచి వచ్చే చైనా డైలీ… చివరికి పాకిస్తాన్ డాన్ పేపర్ లో కూడా రాలేదు. ఒక్క ఇండియన్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ లో మాత్రమే ఈ వార్త వచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ ట్రాకర్‌లో కూడా వివరాలు ఉన్నాయి. ఫేజ్ 1 క్లినికల్ ట్రయిల్స్ ను మాత్రమే రష్యా పూర్తి చేసిందని నమోదైంది. కానీ మన మీడియా మాత్రం వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి అయినట్లు రాశాయి.

తప్పుడు సమాచారం రాసి మనదేశ మీడియా పరువు పొగొట్టుకుంటుందని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కరోనాపై వాస్తవ సమాచారం రాయాలని… తొందరపడి వ్యూస్‌ కోసం రాస్తే మీడియా పరువు పోతోందని వీరు అంటున్నారు.

First Published:  13 July 2020 10:00 AM GMT
Next Story