పితాని కుమారుడి అరెస్ట్ ఖరారు...
ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ అరెస్ట్ ఖాయమైపోయింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ పనిచేశారు. ఆ సమయంలో పితాని సురేష్ తెర వెనుక చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. పితాని సురేష్ ఒత్తిడితోనే పలు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు అంగీకరించారు. కేసులో అరెస్ట్ ఖాయమని అంచనాకు వచ్చిన పితాని సురేష్ […]
ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ అరెస్ట్ ఖాయమైపోయింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ పనిచేశారు. ఆ సమయంలో పితాని సురేష్ తెర వెనుక చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. పితాని సురేష్ ఒత్తిడితోనే పలు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు అంగీకరించారు.
కేసులో అరెస్ట్ ఖాయమని అంచనాకు వచ్చిన పితాని సురేష్ ఇటీవల ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సురేష్‌తో పాటు నాడు పితాని సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
అయితే ఇప్పటికే మురళీమోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పువచ్చే వరకు పోలీసులకు దొరక్కుండా పితాని సురేష్ దాక్కున్నారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఒక రోజు ఆలస్యం అయినా సురేష్ అరెస్ట్ మాత్రం ఖాయమని చెబుతున్నారు.