Telugu Global
International

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌వో పనిచేసి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతామని ఇదివరకు చెప్పిన ట్రంప్‌ ప్రభుత్వం అధికారికంగా ఆ పనిచేసింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ఐక్యరాజ్యసమితికి అధికారికంగా ఆ దేశ ప్రభుత్వం లేఖ రాసింది. అమెరికా రాసిన లేఖ ఈనెల 6న అందినట్టు ఐక్యరాజ్యసమితి కూడా ధృవీకరించింది. […]

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌వో పనిచేసి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతామని ఇదివరకు చెప్పిన ట్రంప్‌ ప్రభుత్వం అధికారికంగా ఆ పనిచేసింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ఐక్యరాజ్యసమితికి అధికారికంగా ఆ దేశ ప్రభుత్వం లేఖ రాసింది.

అమెరికా రాసిన లేఖ ఈనెల 6న అందినట్టు ఐక్యరాజ్యసమితి కూడా ధృవీకరించింది. ఏ దేశమైనా డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలంటే ఏడాది ముందే సమాచారం ఇవ్వాలి. కాబట్టి వచ్చే ఏడాది జులై నుంచి డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా పూర్తిగా తప్పుకుంటుంది. డబ్ల్యూహెచ్‌వోకు అత్యధికంగా నిధులు ఇస్తున్న దేశం అమెరికానే. ఏటా 450 మిలియన్ డాలర్లు అమెరికా సాయం చేస్తోంది.

అయినప్పటికీ డబ్ల్యూహెచ్‌వో చైనా కనుసన్నల్లో పనిచేస్తూ కరోనా విషయంలో భారీ నష్టానికి కారణమైందని భావిస్తున్న ట్రంప్… ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఇస్తున్న నిధులతో పోలిస్తే డబ్ల్యూహెచ్‌వోకు చైనా ఇస్తున్న నిధులు పదో వంతు కంటే తక్కువగానే ఉన్నాయి.

అయితే ట్రంప్ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ ఇచ్చినా… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికైతే నిర్ణయం మారవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

First Published:  8 July 2020 9:01 PM GMT
Next Story