Telugu Global
National

కీలకమైన దశలో పోలవరం పనుల పరుగులు

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌ మాయా లోకంలో మునిగిపోయిన ఈ జలాశయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ, ప్రణాళికతో నిర్మాణ పనులు ఎట్టకేలకు గోదావరి వరద ప్రవాహాన్ని తలపించే విధంగా వేగంగా ఉరకలు వేస్తున్నాయి. తాజాగా పనులు మరో కీలక దశకు చేరుకున్నాయి. అనతి కాలంలో పనుల వేగానికి అద్దంపట్టేలాగా స్పిల్‌వేలో ముందడుగు పడింది. ప్రపంచంలో ఇంతవరకు ఏ జలశయానికి ఏర్పాటు చేయాని విధంగా పోలవరంలో తొలిసారిగా భారీ గేట్లను […]

కీలకమైన దశలో పోలవరం పనుల పరుగులు
X

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌ మాయా లోకంలో మునిగిపోయిన ఈ జలాశయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ, ప్రణాళికతో నిర్మాణ పనులు ఎట్టకేలకు గోదావరి వరద ప్రవాహాన్ని తలపించే విధంగా వేగంగా ఉరకలు వేస్తున్నాయి. తాజాగా పనులు మరో కీలక దశకు చేరుకున్నాయి. అనతి కాలంలో పనుల వేగానికి అద్దంపట్టేలాగా స్పిల్‌వేలో ముందడుగు పడింది.

ప్రపంచంలో ఇంతవరకు ఏ జలశయానికి ఏర్పాటు చేయాని విధంగా పోలవరంలో తొలిసారిగా భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధానాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లు పనిచేయడం ప్రపంచంలోనే అరుదైనది కాగా (ఇప్పటి వరకు రెండే ఉన్నాయి. ఇక్కడ మూడోది) ఇంత భారీ స్థాయిలో హైడ్రాలిక్ గేట్ల విధానం రూపొందించడం ప్రపంచంలో మొదటిది. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పని ప్రారంభించారు. ఈ రోజు నుంచి మొత్తం గడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు.

దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. మామూలుగనైతే ఎలక్ట్రోమెకానికల్ గేట్లను ఎత్తడం దించడం చేస్తారు. మన రాష్ర్టాల్లోని రిజర్వాయర్లన్నింటికీ ఇదే పద్ధతి ఉంది. దీనివల్ల నిర్వాహణ వ్యయంతో కూడికున్నదే కాకుండా ఐరన్ రోప్ (ఇనుప తాళ్లు) తరచు మార్పు చేయాల్సి రావడం లేకపోతే బిగుసుకుపోయి గేట్లు వరదల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ పోలవరంలో ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది.

ఎట్టకేలకు ఈ ప్రాజెక్టులోని కీలకమైన స్పిల్‌వే పని ముందడుగు పడి ఓ రూపాన్ని సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించటంతో ఇప్పుడు మరో ముఖ్యమైన ఘట్టానికి పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ తెరలేపింది. అదే స్పిల్‌వేకి గడ్డర్లు అమర్చటం.

సాధారణంగా ఏ జలాశయానికైనా ఈ పని ఎంతో కీలకమైనది. అందులోనూ పోలవరానికి గడ్డర్ల అమరిక కు మరెంతో ప్రాముఖ్యత ఉంది. అందుకు కారణం ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్‌వే పోలవరం ప్రాజెక్ట్ లో నిర్మితమవుతుండటమే. స్పిల్‌వే పెద్దది అయినప్పుడు అందుకు సంబంధించిన అన్ని అంశాలు ప్రపంచంలోనే పెద్దవి అవుతాయి. దాంతో ఈ జలాశయంలో గడ్డర్లు కూడా ప్రపంచంలో ఇంతవరకూ ఏ ప్రాజెక్టులోనూ లేని స్ధాయిలో ఇక్కడ ఏర్పాటుచేస్తున్నారు. ఆ పని ఇప్పుడు మొదలయ్యింది. జలాశయ స్విల్‌వేలో ఇది కీలకమైన అంకం.

పోలవరం ప్రపంచంలోనే అతి పెద్ద గడ్డర్ల ఏర్పాటు ప్రారంభం

స్పిల్‌వేలోని గేట్లు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన పని మొదలుకావాలంటే తొలుత ఇంటర్నల్‌ ఎంబెడెడ్‌ పార్టుల నిర్మాణ సమయంలో అమర్చటంతోపాటు గడ్డర్లను బిగించాలి. ఈ పనికి ఇప్పుడు అంకురార్పణ జరిగింది. అన్ని గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని గేటు ప్రాంతంలో మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో అమర్చటం ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్‌ సామర్థ్యం ఎంత పెద్దదంటే ఒక్కొక్క దాని బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది.

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కావాలనే ప్రజల చిరకాల కోరిక తీరే దిశగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు తగిన విధంగా మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ ఫా స్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌ ) వడివడిగా నిర్మాణ పనులకు అడుగులు వేయిస్తోంది. ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే లోని 52 బ్లాక్స్‌ కు సంబందించిన పియర్స్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది.

స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో సింహ భాగం పూర్తి అయినట్లే. మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టే సమయానికి పియర్స్‌ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి‌. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమనిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా మేఘా అలవోకగా చేస్తోంది.

స్పిల్‌ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తున్నారు.

ఇక్కడ స్పిల్‌వే గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. అప్పుడే గడ్డర్ల ప్రాముఖ్యత తెలుస్తుంది. జలాశయంలో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు (జల నిర్వహణ మరియు వరద నియంత్రణ) ఉపయోగపడేదే స్పిల్‌వే. స్పిల్‌వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. ఆ విధంగా గడ్డర్ల ద్వారా ఏర్పాటయ్యే హైడ్రాలిక్ వ్యవస్థతో గేట్లు పనిచేస్తాయి. వాటిపై హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

వావ్‌, విస్తుపోయే భారీ గడ్డర్లు – ఒక్కో దాని బరువు 62 టన్నులు

పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్దర్‌ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి‌. కేవలం రెండునెలల్లో వీటిని సిద్ధం చేశారు. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్త 196 గడ్డెర్లకు గాను 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. స్పిల్‌ వే పై గడ్డెర్లను ఒక క్రమ పద్దతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజుల సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్‌ తో రోడ్‌ నిర్మిస్తారు.

ఈ రోడ్‌ నిర్మాణానికి సుమారు ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ అవసరం అవుతుంది. ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. అంటే స్పిల్‌ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్‌ వే లో ఒక వైపు గడ్డెర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండ మేఘా సంస్థ చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్‌ ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్దర్‌ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్‌ నిర్మాణం పూర్తి అయితే గోదావరికి ఎంత వరద వచ్చినా గ్యాప్‌ 1, 3, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (గ్యాప్‌ 2) పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు.

అనతి కాలంలోనే మేఘా ఘనమైనా పనులు

మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగునగంగా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తామనే ధృడమైన విశ్వాసంతో మేఘ సంస్థ ముందుకు వెళుతోంది.

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖ నగర తాగునీటి అవసరాలకు తరలించటం, 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పుడు మేఘా చేస్తున్న పనుల చాలా ముఖ్యమైనవి. అవి మిగిలిన స్పిల్‌ వే పూర్తిచేయటంతోపాట, ఎర్త్ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌), అనుబంధ పనులు, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణం, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయటం.

నాడు వైఎస్‌ బీజం – నేడు జగన్‌ నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనిని నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖరెడ్డి చొరవతో 2005లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాదాపు కుడి ఎడమ కాలువ అప్పుడే పూర్తయ్యాయి. అప్పట్లో తవ్విన కుడికాలువపైనే పట్టిసీమను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే రాకెట్‌ వేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది.

నాటి సిఎం చంద్రబాబు 30 విడతలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. 90 విడతలు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి హడావిడి చేశారు. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని నాటి శాసనసభలోనే ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కు అన్నట్లుగా సాగాయి.

2019 ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన పనులను కూడా పూర్తిచేయలేక పోయింది. ఎన్నికల సమయంలో ప్రధాని మోడి పోలవరం తెగుదేశం పార్టీ నేతలకు ఏటీఎం లా మారిందని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. దేశంలో 23 జాతీయ ప్రాజెక్టులను ఇప్పటివరకూ నిర్మించారు. ఇందులో కొన్నింటిని నిర్మిస్తున్నారు. ఏ ప్రాజెక్టునైనా జాతీయ ప్రజెక్టుగా ప్రకటించాక నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అయితే టిడిపి అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఇపుడే అధికారంలోకి వచ్చాం ఎంత అందితే అంత నొక్కేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో చేపట్టేలాగ అనుమతులు సాధించుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుకు డబ్బు మీరివ్వండి నిర్మాణ బాధ్యతలు మేం చేపడతాం అని చెప్పలేదు.

కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో పట్టుపట్టి మరీ సాధించుకుంది. ఆ పట్టు వెనుక ఉన్న మర్మం ఏమిటో ఆ తరువాత జరిగిన పరిణామాలు, ప్రధాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లం అయ్యింది. 2019 ఎన్నికల్లో వైసీపి అధికారంలోకి రావటంతో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు మేఘాకు అప్పగించింది. అప్పటి నుంచి పనులు గోదావరి పరవళ్లను మరిపించేలా పరుగులు పెడుతున్నాయి. గోదావరి వరద వయ్యారం లాగా వేగంగా జరుగుతున్న పనులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

First Published:  6 July 2020 10:23 PM GMT
Next Story