కరోనా రేపిన చిచ్చు... గవర్నర్ వర్సెస్ సీఎం
తెలంగాణలో కరోనా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంటోంది. తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో పలు విమర్శలు వస్తుండగా ఇప్పుడు గవర్నర్ నేరుగా జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమైంది. గవర్నర్ వెనుక బీజేపీ పెద్దలు ఉండి కథ నడిపిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై నేరుగా జోక్యం చేసుకుంటున్న గవర్నర్… సోమవారం ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హెల్త్ సెక్రటరీని రావాల్సిందిగా ఆదేశించారు. వారు మాత్రం రాలేదు. తమకు మరో […]
తెలంగాణలో కరోనా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంటోంది. తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో పలు విమర్శలు వస్తుండగా ఇప్పుడు గవర్నర్ నేరుగా జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమైంది. గవర్నర్ వెనుక బీజేపీ పెద్దలు ఉండి కథ నడిపిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా పరిస్థితులపై నేరుగా జోక్యం చేసుకుంటున్న గవర్నర్… సోమవారం ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హెల్త్ సెక్రటరీని రావాల్సిందిగా ఆదేశించారు. వారు మాత్రం రాలేదు. తమకు మరో పని ఉందని… మంగళవారం వస్తామని స్పష్టం చేశారు.
ఇలా గవర్నర్ పిలిచినా అధికారులు రాకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒత్తిడి ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎం కేసీఆర్ హైదరారాబాద్‌లో అందుబాటులో లేని సమయంలో గవర్నర్ ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో ఈ సమీక్షకు అధికారులను వెళ్లకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ అరగంట పాటు నెటిజన్ల నుంచి ట్విట్టర్ వేదికగా అభిప్రాయలు తీసుకున్నారు. పలువురు కరోనా విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ఆమెను కోరారు. ఇంతలోనే కరోనా రోగులను చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీకి గవర్నర్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయని విమర్శలు రావడంతో గవర్నర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉండగా ఇలా నేరుగా గవర్నర్ సమీక్షలకు దిగడంతో ఇది రాజకీయ దుమారం రేపుతోంది.