Telugu Global
International

ఐసీఎంఆర్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం

ఒక పక్క కరోనా మహమ్మారి దెబ్బకి దేశం మొత్తం చిగురుటాకులా వణికి పోతుంటే.. మరొకపక్క దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తన వ్యవహార శైలితో ఉన్న పరువు పొగుట్టుకుంది. అసలు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న ఐసీఎంఆర్‌లో మితి మీరిన రాజకీయ జోక్యం వల్ల కనీస ప్రాధమిక అంశాలను పక్కనపెట్టి ఎట్టి పరిస్తితుల్లోనూ ఆగస్ట్ 15 నాటికి కరొనా వ్యాక్సిన్ అందించాలని సదరు ప్రైవేట్ సంస్థలకు లెటర్ […]

ఐసీఎంఆర్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం
X

ఒక పక్క కరోనా మహమ్మారి దెబ్బకి దేశం మొత్తం చిగురుటాకులా వణికి పోతుంటే.. మరొకపక్క దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తన వ్యవహార శైలితో ఉన్న పరువు పొగుట్టుకుంది. అసలు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న ఐసీఎంఆర్‌లో మితి మీరిన రాజకీయ జోక్యం వల్ల కనీస ప్రాధమిక అంశాలను పక్కనపెట్టి ఎట్టి పరిస్తితుల్లోనూ ఆగస్ట్ 15 నాటికి కరొనా వ్యాక్సిన్ అందించాలని సదరు ప్రైవేట్ సంస్థలకు లెటర్ రాయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తయారీపై అవగాహన ఉండి కూడా అలాంటి ఆదేశాలు సంస్థ ఎలా ఇస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఐసీఎంఆర్ ఆదేశాలు చూసి ఖంగుతిన్న సైంటిస్టులు, డాక్టర్లు.. ఆ సంస్థ తీరుని తీవ్రంగా తప్పు పట్టడంతో పరువు పోయిందని గ్రహించిన ఐసీఎంఆర్ తన తప్పును కప్పిపుచ్చుకొవడానికి తాము కేవలం పరిశోధన వేగవంతం చెయ్యమని మాత్రమే చెప్పామని.. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తయారు చెయ్యాలని తాము ఎవరినీ ఆదేశించలేదని మరో లేఖ రాయాల్సి వచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఐసీఎంఆర్ ఒక రాజకీయ సంస్థగా మారిందనే అపప్రద మూటగట్టుకొవాల్సి వచ్చింది.

సాధారణంగా డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త వ్యాక్సిన్ తయారు చెయ్యాలంటే క్లినికల్ ట్రైల్స్ 3 దశల్లో చెయ్యాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రయల్ డేటాని పూర్తిగా అన్ని కోణాల్లో విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్ అప్రూవల్ చేసి.. సదరు వ్యాక్సిన్ వాణిజ్య ఉత్పత్తికి అనుమతి ఇస్తారు. ఈ మొత్తం క్లినికల్ ట్రాయల్స్ ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.

మొదటి దశలో 120 మందికి వ్యాక్సిన్ ఇచ్చి 28 రోజుల పాటు పరీక్షిస్తారు. రెండవ దశలో 1200 మందికి వ్యాక్సిన్ ఇచ్చి కనీసం 5-6 నెలలు పరీక్షించాలి. ఇక చివరి మూడవ స్టేజ్‌లో ఎక్కువ మందిని ఎంపిక చేసి వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ దశలో రక్షణ మరియు సమర్థతను సమగ్రంగా పరీక్షిస్తారు. ఇలా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 15 నుండి 18 నెలలు పడుతుంది.

ఈ నిబంధనలు సరిగా పాటించకుండా వ్యాక్సిన్ విడుదల చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అది వైరస్ కన్నా ప్రమాదం. అన్ని దశల్లో సత్ఫలితాలు ఇచ్చిన తర్వాతే వ్యాపార పరంగా ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఇక వ్యాక్సిన్ తయారీ పూర్తయిన తర్వాత దాని ధర కూడా సమగ్రంగా ఉండేలా చూస్తారు. ఇది అందరికీ సరైన సమయానికి అందించగలమో లేదో చూడాలి.

ఇక కరోనా వ్యాక్సిన్ (కో-వ్యాక్సిన్) విషయానికొస్తే ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫార్మా బయెటెక్ దిగ్గజ కంపెనీలతో పాటు పలు ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు 140 వ్యాక్సిన్ ల తయారీ ప్రక్రియలో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 11 సంస్థలకు 2 వ దశ క్లినికల్ ట్రైల్స్ వరకు అనుమతి లభించగా అందులొ మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ (హైదారాబాద్) తో పాటు జైడస్ క్యాడిలా (అహ్మదాబాద్) ఉన్నాయి. ఇక వీటితోపాటు ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు ఫైజర్.. జాన్సన్&జాన్సన్.. నోవా వ్యాక్స్.. సినోవ్యాక్.. బయో ఎన్-టెక్.. ఇన్ వివో.. వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలు 2 వ దశ క్లినికల్ ట్రైల్స్ వరకు అనుమతి పొందాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరో 15 కంపెనీలు మొదట దశ క్లినికల్ ట్రైల్ వరకు అనుమతి పొందాయి.

ఇక హైదరబాద్ లోని భారత్ బయెటెక్ కంపెనీ ఈ వారం క్లినికల్ ట్రైల్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించింది. తాము మూడు దశల్లో క్లినికల్ ట్రైల్స్ పూర్తిచేసి మరో 15 నెలల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా ఒకపక్క వాస్తవాలు ఇలా ఉంటే.. పలానా కంపెనీ వ్యాక్సిన్ తయారుచేసిందని.. ఆగస్టు 15 నుండే పలానా కంపెనీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రాబోతుందంటు జరుగుతున్న ప్రచారం కేవలం సదరు కంపెనీల ఆర్భాటపు మార్కెటింగ్ ప్రచారం.. మరియు మన మీడియా అత్యుత్సాహం మాత్రమే!!

ఇక సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్ లలో సర్క్యులేట్ అవుతున్న పుకార్ల గురించి.. నా వల్లే కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ప్రకటనలిస్తున్న కొందరు రాజకీయ నాయకుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.

ఇక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడం ఒక ఎత్తు అయితే మన 130 కోట్ల మంది జనాభాకు ఆ వ్యాక్సిన్ ని అందించడం అన్నిటికన్నా అతి పెద్ద ఛాలెంజ్. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన సహజంగానే పోషకాహార లోపం, బీపీ, డయాబెటిక్ వంటి సమస్యలతో వ్యాధి నిరోధకత తక్కువగా వుండే మన భారతీయులపై ఈ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావం చూపగలదో చూడాలి.

First Published:  6 July 2020 8:54 AM GMT
Next Story